Poonch attack: ఉగ్రవాదుల ఫొటోలు విడుదల.. పాక్ హస్తం ఉన్నట్లుగా గుర్తింపు!
- Follow Us :
-
-
Add as a preferred
source on google
గత వారం జమ్మూకాశ్మీర్‌లోని పూంచ్‌లో వైమానిక దళం కాన్వాయ్‌పై లష్కర్ ఉగ్రవాదులు దాడికి తెగబడ్డారు. దీని వెనుక పాక్ హస్తం ఉన్నట్లుగా తెలుస్తోంది. ఆ దేశానికి చెందిన మాజీ కమాండో ఈ ఘటనలో నేరుగా పాల్గొన్నట్లు భద్రతా దళాలు గుర్తించాయి. దర్యాప్తులో భాగంగా ముగ్గురు ఉగ్రవాదుల చిత్రాలను సేకరించాయి. వీరిలో పాక్ సైన్యం ప్రత్యేక దళాల్లో పనిచేసిన ఓ మాజీ కమాండో కూడా ఉండటం విశేషం. ఇల్లియాస్, అబూ హమ్జా, హడూన్‌గా గుర్తించారు. కొత్తగా ఏర్పాటు చేసిన పీపుల్స్ యాంటీ ఫాసిస్ట్ ఫోర్స్ తరఫున ఈ ముగ్గురు ఉగ్రవాదులు కాన్వాయ్‌పై దాడి చేసినట్లు తెలుస్తోంది. ఈ సంస్థ జైషే అహ్మద్ అనుబంధంగా పనిచేస్తోంది. భద్రతా దళాలు ఈ ఉగ్రవాదులను పట్టుకోవడానికి రాజౌరీ, పూంఛ్ జిల్లాల్లో భారీ గాలింపు చర్యలు చేపట్టాయి. ఇప్పటికే పలువురు అనుమానితులను అదుపులోకి తీసుకుని ప్రశ్నిస్తున్నారు.
ఇది కూడా చదవండి: KGF 3: కేజీఎఫ్ 3పై క్రేజీ అప్డేట్ ఇచ్చిన ప్రశాంత్ నీల్.. ఫ్యాన్స్ రెడీనా..
Also Read
- BSNL బంపర్ ఆఫర్.. 365 రోజులకు బదులుగా 412 రోజుల వ్యాలిడిటీ.! రోజుకు 2GB హై-స్పీడ్ డేటా కూడా..
- Shehbaz Sharif: భారత్‌పై షాబాజ్ షరీఫ్ ఫైర్.. ప్రతి నీటి చుక్కా రెడ్ లైన్..! ఆపరేషన్ సింధూర్ను మరిచిపోలేదా?
- BSNL రూ.1 ప్లాన్ మళ్లీ వచ్చేసింది.. అన్లిమిటెడ్ కాలింగ్, 24 రోజుల వ్యాలిడిటీ..!
- Nepal Gorkhas: "మేము భారత సైన్యంలో చేరుతాం".. నేపాల్‌లో రోడ్డెక్కిన యువత
ముగ్గురు ఉగ్రవాదులు హై పవర్డ్ రైఫిల్స్‌ను ఉపయోగించినట్లు సమాచారం. వీరి వయసు 30-32 ఏళ్ల మధ్య ఉంటుంది. ఏకే 47 రైఫిల్స్‌తో పాటు, అమెరికా తయారీ ఎం-4 కార్బైన్‌ను, స్టీల్ తూటాలను వాడినట్లు తెలుస్తోంది. గతేడాది డిసెంబర్‌లో కూడా సైనిక వాహనంపై పీఏఎఫ్‌ఎఫ్ సంస్థ ఉగ్రవాదులు మాటు వేసి దాడి చేశారు. నాటి ఘటనలో నలుగురు సైనికులు మృతి చెందారు. అప్పుడు కూడా స్టీల్ తూటాలు వాడినట్లు గుర్తించారు.
ఇది కూడా చదవండి: Uttam Kumar Reddy : తడిసిన ధాన్యంపై మంత్రి ఉత్తమ్ కీలక ప్రకటన
మే 4న కాన్వాయ్‌పై జరిగిన ఉగ్రదాడిలో వైమానిక దళ సైనికుడు మృతిచెందగా.. ఐదుగురు సహచరులు గాయపడ్డారు. పూంచ్ అనంత్‌నాగ్-రాజౌరీ పార్లమెంటరీ నియోజకవర్గంలో భాగంగా ఇక్కడ ఆరవ దశలో మే 25న పోలింగ్ జరగనుంది.
ఇది కూడా చదవండి: Car Sales In April 2024 : ఏప్రిల్‌లో భారతదేశంలో అత్యధికంగా అమ్ముడైన 10 కార్లు..
తాజావార్తలు
-
Mega 158 : చిరు – బాబీ సినిమాకు ‘కదిరి కాకాజీ’ టైటిల్ ఫిక్స్ చేసారా?
-
BSNL బంపర్ ఆఫర్.. 365 రోజులకు బదులుగా 412 రోజుల వ్యాలిడిటీ.! రోజుకు 2GB హై-స్పీడ్ డేటా కూడా..
-
JCB Hydrogen Car: బుల్డోజర్ల తయారీ సంస్థ JCB వరల్డ్ రికార్డు.. హైడ్రోజన్ కారుతో గంటకు 653.90KM స్పీడ్!
-
Mallu Wood : వరుస హిట్స్.. నెక్ట్స్ సినిమాల రిలీజ్ ప్లానింగ్‌లో మాలీవుడ్ స్టార్స్ కన్ఫ్యూజన్
-
Shehbaz Sharif: భారత్‌పై షాబాజ్ షరీఫ్ ఫైర్.. ప్రతి నీటి చుక్కా రెడ్ లైన్..! ఆపరేషన్ సింధూర్ను మరిచిపోలేదా?
ట్రెండింగ్
-
IND vs SL: గిల్, రాహుల్, పంత్ కాదు.. అతడే సబ్ కాంటినెంట్‌కు కింగ్.. మొదటి టెస్టులో ఆడించాలి!
-
BSNL రూ.1 ప్లాన్ మళ్లీ వచ్చేసింది.. అన్లిమిటెడ్ కాలింగ్, 24 రోజుల వ్యాలిడిటీ..!
-
200MP కెమెరా, 8,000mAh బ్యాటరీతో Honor Magic 9 సిరీస్ లాంచ్ కు ముహూర్తం ఫిక్స్.!
-
కొత్త ‘ఆలివ్ మాట్రిక్స్ డిస్ప్లే’తో.. ఆగస్టు 18న POVA 8 Pro లాంచ్..!
-
బ్లాక్ డిజైన్, హైబ్రిడ్ పవర్‌తో Toyota Hyryder Aero Black Edition వచ్చేసింది.. ధర, ఫీచర్లు ఇవే..!