NTV Telugu Site icon

Terror Group SIMI: ఉగ్రవాద సంస్థ సిమిపై మరో ఐదేళ్ల పాటు నిషేధం పొడిగింపు

Simi Banned

Simi Banned

Terror Group SIMI: ఉగ్రవాద సంస్థ స్టూడెంట్స్ ఇస్లామిక్ మూవ్‌మెంట్ ఆఫ్ ఇండియా(SIMI)పై భారత ప్రభుత్వం కఠిన చర్యలు తీసుకుంది. హోం మంత్రిత్వ శాఖ ఈ రోజు (జనవరి 29) ఈ సంస్థను కఠినమైన ఉగ్రవాద నిరోధక చట్టం ప్రకారం దానిపై నిషేధాన్ని మరో ఐదేళ్లపాటు ‘చట్టవిరుద్ధమైన సంఘం’గా ప్రకటించింది. ఇది నిషేధిత సంస్థ అని అందరికి తెలిసిందే. కేంద్ర హోంమంత్రి అమిత్ షా సోషల్‌ మీడియాలో పోస్ట్‌ చేస్తూ.. ఉగ్రవాదానికి వ్యతిరేకంగా ప్రధాని నరేంద్ర మోడీ జీరో టాలరెన్స్ విధానాన్ని బలోపేతం చేస్తూ, చట్టవిరుద్ధ కార్యకలాపాల నిరోధక చట్టం ప్రకారం సిమిని ఐదేళ్ల పాటు ‘చట్టవిరుద్ధమైన సంఘం’గా ప్రకటించారు. భారత్ సార్వభౌమత్వం, భద్రత, సమగ్రతకు ముప్పు కలిగించేలా ఉగ్రవాదాన్ని పెంచి, శాంతికి, మత సామరస్యానికి భంగం కలిగించడంలో ఈ సంస్థ ప్రమేయం ఉన్నట్లు తేలిందని అమిత్‌ షా అన్నారు. సిమి తన విధ్వంసకర కార్యకలాపాలను కొనసాగిస్తోందని, ఇంకా పరారీలో ఉన్న తమ కార్యకర్తలను మళ్లీ సమూహపరుస్తోందని కేంద్ర హోం మంత్రిత్వ శాఖ ఒక నోటిఫికేషన్‌లో పేర్కొంది. మతతత్వం, శత్రుత్వం సృష్టించి దేశ వ్యతిరేక కార్యకలాపాలకు ఈ సంస్థ ప్రయత్నిస్తోంది.

Read Also: Manohar Lal Khattar: హర్యానా సీఎం ఖట్టర్ సంచలన నిర్ణయం..

ఈ సంస్థ 1977లో స్థాపించబడింది..
దేశంలో ఇస్లామిక్ జిహాద్‌ను వ్యాప్తి చేసే పనిలో ఈ సంస్థ ప్రమేయం ఉందని కొద్ది రోజుల క్రితం కేంద్ర ప్రభుత్వం సుప్రీంకోర్టులో పేర్కొంది. ఈ సిమి నిషేధిత ఇస్లామిక్ విద్యార్థి సంస్థ అని తెలిసిందే. ఈ సంస్థ ఉత్తరప్రదేశ్‌లోని అలీఘర్‌లో 25 ఏప్రిల్ 1977న స్థాపించబడింది. అటల్ బిహారీ వాజ్‌పేయి ప్రభుత్వం అధికారంలో ఉన్నప్పుడు 2001లో ఉగ్రవాద కార్యకలాపాలకు పాల్పడినందుకు సిమిపై తొలిసారి నిషేధం విధించారు. దీని తర్వాత, 2008లో కొన్ని రోజుల పాటు సంస్థపై నిషేధం ఎత్తివేయబడింది. అయితే, జాతీయ భద్రత దృష్ట్యా, అదే సంవత్సరం సంస్థను మళ్లీ నిషేధించారు. అప్పటి నుంచి ప్రతి ఐదేళ్లకు నిషేధం పొడిగించబడింది. యూపీఏ ప్రభుత్వ హయాంలో 2014 ఫిబ్రవరి 1న ఐదేళ్ల పాటు నిషేధించబడింది. 2017లో గయాలో పేలుళ్లు, 2014లో బెంగుళూరులోని చిన్నస్వామి స్టేడియం, 2014లో భోపాల్‌లో జైల్‌బ్రేక్ వంటి ఉగ్రవాద చర్యలలో సిమి సభ్యులు ప్రమేయం ఉన్నట్లు ఆరోపణలు ఉన్నాయి.