Terror Attack: పాకిస్థాన్‌లో ఉగ్రవాదులు మరోసారి రెచ్చిపోయారు. పాక్‌లోని ఖైబర్ పఖ్తుంఖ్వా ప్రావిన్స్‌లో ఆదివారం కొత్తగా నిర్మించిన పోలీస్ స్టేషన్‌పై ఉగ్రవాదుల దాడిలో నలుగురు పాకిస్తాన్ పోలీసులు మరణించారు. చాలా మంది ఈ దాడిలో గాయపడ్డారు. దక్షిణ వజీరిస్థాన్ గిరిజన జిల్లా సరిహద్దులో ఉన్న లకీ మార్వాట్‌లోని బార్‌గాయ్ పోలీస్ స్టేషన్‌పై ఉగ్రవాదులు హ్యాండ్ గ్రెనేడ్‌లు, రాకెట్ లాంచర్‌లతో సహా మారణాయుధాలతో దాడి చేసినట్లు పోలీసులు తెలిపారు. పోలీసులతో భీకర ఎదురుకాల్పులు జరిగిన తర్వాత అనుమానిత ఉగ్రవాదులు అక్కడి నుంచి పారిపోయారని పేర్కొంది. అనుమానితుల ఆచూకీ కోసం భారీ పోలీసు బలగాలు ఆ ప్రాంతంలో గాలింపు చర్యలు చేపట్టారు.
ఖైబర్ పఖ్తుంఖ్వా ప్రావిన్స్ ముఖ్యమంత్రి మెహమూద్ ఖాన్ ఈ దాడిని పిరికిపంద చర్యగా అభివర్ణించారు. ప్రావిన్షియల్ పోలీసు చీఫ్ నుంచి తక్షణ నివేదికను కోరారు.అధ్యక్షుడు ఆరిఫ్ అల్వీ కూడా దుఃఖంలో ఉన్న కుటుంబాలకు తన సంతాపాన్ని వ్యక్తం చేశారు. ఉగ్రవాద కార్యకలాపాలను పూర్తిగా నిర్మూలించే వరకు తమ ప్రయత్నాలు కొనసాగుతాయని దాడిని ఖండించారు. పాకిస్థాన్‌లో జరిగిన ఉగ్రదాడికి తామే బాధ్యులమని ఏ గ్రూపు వెంటనే ప్రకటించలేదు. దాడికి బాధ్యులెవరూ వెంటనే బాధ్యత వహించనప్పటికీ, జిల్లాలో పోలీసులపై గతంలో జరిగిన దాడులను తెహ్రీక్-ఇ-తాలిబాన్ పాకిస్తాన్ (TTP) తామే చేసినట్లు అంగీకరించింది. 2007లో అనేక తీవ్రవాద సంస్థల సమూహంగా ఏర్పాటైన టీటీపీ.. జూన్‌లో ఫెడరల్ ప్రభుత్వంతో అంగీకరించిన కాల్పుల విరమణను రద్దు చేసింది. దేశవ్యాప్తంగా తీవ్రవాద దాడులను నిర్వహించాలని దాని ఉగ్రవాదులను ఆదేశించింది.
Kamal Haasan: భారత్ జోడో యాత్రలో రాహుల్‌తో కలిసి పాల్గొననున్న కమల్‌హాసన్!
గత నెలలో, ఉగ్రవాదులు పోలీసు పెట్రోలింగ్ వాహనంపై దాడి చేసి, అదే ప్రాంతంలో ఆరుగురు పోలీసులను చంపారు. ఈ దాడికి తామే బాధ్యులమని పాకిస్థాన్ తాలిబాన్ ప్రకటించింది. 2009లో ఆర్మీ ప్రధాన కార్యాలయంపై దాడి, సైనిక స్థావరాలపై దాడులు, 2008లో ఇస్లామాబాద్‌లోని మారియట్ హోటల్‌పై బాంబు దాడితో సహా పాకిస్థాన్ అంతటా అనేక ఘోరమైన దాడులకు ఆల్-ఖైదాకు సన్నిహితంగా భావిస్తున్న ఈ గ్రూపు చేసినట్లు సమాచారం.
