HYD Terros Gardening Story: ఫుల్ ట్రెండ్‌లో టెర్రస్ గార్డెనింగ్ కల్చర్.. సిటీ జనాలు ఎందుకు ఇటు వైపు మళ్లుతున్నారు?
- టెర్రస్ గార్డెనింగ్ అనే కల్చర్ ఇప్పుడు ఫుల్ ట్రెండ్‌లో
- హార్టికల్చర్ డిపార్ట్మెంట్ కూడా నెలకి రెండు సార్లు ప్రత్యేక ట్రైనింగ్స్ ఇస్తోంది
- సిటీ జనాలు ఎందుకు టెర్రస్ గార్డెన్స్ వైపు మళ్లుతున్నారు
- Follow Us :
-
-
Add as a preferred
source on google
సిటీ లైఫ్ అనగానే గుర్తుకువచ్చేది ట్రాఫిక్, పొల్యూషన్.. అలాంటిది ఇప్పుడు సిటీలో పచ్చదనం కూడా పెరుగుతోంది. టెర్రస్ గార్డెనింగ్ అనే కల్చర్ ఇప్పుడు ఫుల్ ట్రెండ్‌లో ఉంది. దీని కోసం హార్టికల్చర్ డిపార్ట్మెంట్ కూడా నెలకి రెండు సార్లు ప్రత్యేక ట్రైనింగ్స్ ఇస్తోంది. ఇంత బిజీ లైఫ్ స్టైల్ లో కూడా ఎందుకు ఈ కల్చర్ ఇంతగా పెరుగుతోంది? సిటీ జనాలు ఎందుకు టెర్రస్ గార్డెన్స్ వైపు మళ్లుతున్నారు?
Also Read:PVN Madhav: ఇది చారిత్రాత్మకం.. జై అమరావతి.. జై జై అమరావతి..
Also Read
- నేడే Apple Surprise and Shine Event.. ఫోల్డబుల్ iPhoneతో పాటు iPhone 18 Pro, కొత్త Apple Watchలు.. ఇంకా ఏం రాబోతున్నాయంటే?
- Assam Murder Case: ఫ్రిజ్‌లో తల, వేళ్లు నరికిన భర్త.. పెంపుడు కుక్కకు మృతదేహాన్ని తినిపించే ప్లాన్?
- Tata Nexonపై రూ.75,000 వరకు ఆఫర్.. స్క్రాపేజ్ బెనిఫిట్‌తో మరింత ఆదా.!
- CM Chandrababu: నేడు కోనసీమలో సీఎం చంద్రబాబు పర్యటన.. రైతులతో ముఖాముఖి, పార్టీ కార్యకర్తలతో సమావేశం!
ఒకప్పుడు టెర్రస్ అంటే ఖాళీ స్థలం. ఇప్పుడు అదే స్థలం ఆరోగ్యానికి అడ్రస్‌గా మారుతోంది. ఇప్పుడు అదే టెర్రస్ లో. టమాటో, వంకాయ, మిర్చి, కొత్తిమీరతో నిండిపోతోంది. సిటీ జనాలు ఇప్పుడు మార్కెట్ మీద డిపెండ్ అవ్వడం తగ్గించి. తమ ఇంటి మీదే కూరగాయాలు పండిస్తున్నారు. కారణం ఒక్కటే. హెల్త్ మీద శ్రద్ధ పెరిగిపోయి… కెమికల్స్ లేని ఆహరం తో పాటు..మెంటల్ పీస్ కోరుకుంటున్నారు. ఇలా నగర వాసులకి ఆర్గానిక్ ఫుడ్ మీద మక్కువ పెరిగిపోయింది..
సిటీ జనాల్లో వచ్చిన ఈ మార్పుని గమనించిన హార్టికల్చర్ డిపార్ట్మెంట్.. టెర్రస్ గార్డెనింగ్‌ని మరింత ప్రోత్సహిస్తోంది. నెలకి రెండు సార్లు ప్రత్యేక ట్రైనింగ్స్ అది కూడా బిగినర్స్ నుండి అడ్వాన్స్ లెవెల్ వరకూ.. మట్టీ ఎలా ఉండాలి? ఏ సీడ్ ఎప్పుడు వేయాలి? ఏ కూర ఏ సీజన్‌లో బాగుంటుంది. పురుగులు రాకుండా ఏం చేయాలి. ఇలా అన్నీ స్టెప్ బై స్టెప్‌గా నేర్పిస్తున్నారు. హార్టికల్చర్ విద్యార్థుల నుండి నర్సరీ వ్యాపారులు, ఉగ్యోగులు, ఇంట్లో కాలిగా ఉండే వృద్ధుల వరకూ ఇలా ప్రతి ఒక్కరూ ట్రైనింగ్ తీసుకుంటున్నారు..
చాలామందికి టెర్రస్ గార్డెనింగ్ అంటే ఇంట్రెస్ట్ ఉన్నా. కొన్ని డౌట్స్ కూడా ఉంటాయి.. ప్రెసెంట్ ఉన్న బిజీ లైఫ్ లో దానికోసం టైం కేటాయించలేక కొందరు… గార్డెనింగ్ స్టార్ట్ చేసి వాటిని ఎలా చూసుకోవాలో తెలియక మరికొందరు ఆగిపోతున్నారు.. అలాంటివారికోసం నాంపల్లి రెడ్ హిల్స్ దగ్గర ఉన్న హార్టికల్చర్ ట్రైనింగ్ ఇన్స్టిట్యూట్ వాళ్ళు వందరూపాయల నామమాత్రపు ఫీజుని తీసుకోని నెల రోజుల పాటు ప్రతి శనివారం ట్రైనింగ్ ఇస్తున్నారు..రోజుకి ఎక్కువ టైమ్ అవసరం లేదు.. కేవలం 15 నుంచి 20 నిమిషాలు గార్డెనింగ్ కి స్పెండ్ చేస్తే చాలు అంటున్నారు నిపుణులు.
సిటీ లో ఉన్న టెర్రస్‌లు, అపార్ట్మెంట్ బాల్కని లు అన్ని కలుపుకొని దాదాపు 25 వేల ఎకరాల్లో గార్డెనింగ్ చేస్తున్నారు.. కరోనా తరువాత ప్రతి ఒక్కరిలో ఆరోగ్యం పట్ల శ్రద్ధ పెరిగి ఆర్గానిక్ ఫుడ్ మీద అవేర్నెస్ పెరిగిపోయింది.. దాంతో ప్రతి ఒక్కరు వారికీ ఉన్న స్థలం లోనే సొంతంగా సేంద్రియ పద్దతిలో కూరగాయలు పండిస్తున్నారు…ఇప్పటివరకు సిటీ లో 80 వేల మంది టెర్రస్ గార్డెనింగ్ ట్రైనింగ్ తీసుకొని ఇంటిపైన పండ్లు.. కూరగాయలు పండిస్తున్నారు..
ఒకప్పుడు పల్లెటూరుల్లో ఎవరి ఇంట్లో వారే ఆకు కూరలు, కూరగాయలు పండించుకునేవారు.. పెరిగిన అర్బన్ కల్చర్ లో అది తగ్గిపోయింది.. బయట దొరికే కూరగాయలు మందులతో పండిస్తున్నారు.. దీంతో చిన్న పెద్ద అనే వయసు వ్యత్యాసం లేకుండా అందరికి అనారోగ్య సమస్యలు వస్తున్నాయి.. దీంతో అర్బన్ సిటీస్ లో కూడా గార్డెనింగ్ స్టార్ట్ చేసారు..కరోనా తరువాత సెలెబ్రేటీ లు సైతం టెర్రస్ గార్డెనింగ్ మొదలు పెట్టారు దీంతో అందరిలో ఆరోగ్యం తో పాటు ఆర్గానిక్ ఫుడ్ మీద అవేర్నెస్ పెరిగిపోయింది…గార్డెనింగ్ చేయాలనీ ఉంటే సరిపోదు.. ఎలా చేయాలో కూడా తెలిసి ఉండాలి అందుకు తప్పనిసరిగా ట్రైనింగ్ అవసరం అని నాంపల్లి రెడ్ హిల్స్ దగ్గర ఉన్న హార్టికల్చర్ ట్రైనింగ్ ఇన్స్టిట్యూట్ అధికారులు చెబుతున్నారు..
చాలా మంది దీనిని ముందు ఒక హాబీగా మొదలెట్టారు. ఇప్పుడు అది లైఫ్ స్టైల్ అయిపోయింది అంటున్నారు. ఇది కేవలం కూరగాయలు పండించడం మాత్రమే కాదు. సిటీలో పొల్యూషన్ తగ్గించడంలో. ఇంటి టెంపరేచర్ కంట్రోల్ చేయడంలో. ఇది చాలా హెల్ప్ అవుతుంది. పిల్లలకి కూడా మంచి టైం పాస్ తో పాటు ప్రకృతితో కనెక్ట్ అయ్యే అవకాశం వస్తోంది. ఒక ఇంటి టెర్రస్‌తో మొదలైన ఈ కల్చర్. ఇప్పుడు అపార్ట్మెంట్స్ వరకూ విస్తరిస్తోంది. సిటీ లైఫ్‌లో ఆరోగ్యం కావాలంటే. పచ్చదనం తప్పనిసరి అంటున్నారు నిపుణులు. మీ టెర్రస్ చిన్నదైనా సరే. ఒక మొక్కతో మొదలుపెట్టండి అని చెప్తున్నారు.
Also Read:Off The Record: బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు ఎవరైనా కవిత పార్టీ వైపు మొగ్గుతున్నారా?
ఇప్పటికే సిటీ లో ప్రతి ఒక్కరి ఇంట్లో ప్లాంటేషన్ స్టార్ట్ చేశారు… వారికీ ఉన్న స్థలాన్ని బట్టి పూలు, పండ్లు, కూరగాయల చెట్లు వేస్తున్నారు..కొన్ని అపార్ట్మెంట్స్ అయితే కామన్ టెర్రస్ గార్డెన్స్ కూడా స్టార్ట్ చేశాయి. ఇది ఒక వ్యక్తి హాబీ నుంచి కమ్యూనిటీ కల్చర్‌గా మారుతోంది. సిటీ లైఫ్‌లో హెల్త్ కావాలంటే పచ్చదనం తప్పనిసరి అయింది..
తాజావార్తలు
-
నేడే Apple Surprise and Shine Event.. ఫోల్డబుల్ iPhoneతో పాటు iPhone 18 Pro, కొత్త Apple Watchలు.. ఇంకా ఏం రాబోతున్నాయంటే?
-
Assam Murder Case: ఫ్రిజ్‌లో తల, వేళ్లు నరికిన భర్త.. పెంపుడు కుక్కకు మృతదేహాన్ని తినిపించే ప్లాన్?
-
IPL Team Owners: ఆస్ట్రేలియా క్రికెట్లో కీలక పరిణామం.. ఐపీఎల్ టీమ్ ఓనర్లకు పండగే ఇగ!
-
Shreyas Iyer: శ్రేయాస్ అయ్యర్‌కు షాక్.. వెస్టిండీస్‌తో వన్డే సిరీస్‌కు దూరం.. అసలు కారణం ఇదే!
-
Tata Nexonపై రూ.75,000 వరకు ఆఫర్.. స్క్రాపేజ్ బెనిఫిట్‌తో మరింత ఆదా.!
ట్రెండింగ్
-
కేవలం 6.39 మి.మీ. మందం, 144Hz AMOLED డిస్ప్లే, 6500mAh బ్యాటరీతో TECNO CAMON Slim 5G లాంచ్.!
-
Vaibhav Sooryavanshi: వైస్ కెప్టెన్ ఎందుకు చేశారన్నారు.. కెప్టెన్‌కే సలహాలు ఇస్తున్న వైభవ్.. వీడియో వైరల్!
-
Harry Potter అభిమానులకు గుడ్ న్యూస్.. Realme కొత్త స్పెషల్ ఎడిషన్ లాంచ్.!
-
Homemade Pani Puri: పానీపూరి అంటే ఇష్టమా? బయట బండి దగ్గర ఉండే టేస్ట్.. ఇంట్లోనే సులువుగా ఇలా చేసుకోండి ఇలా.!
-
Pigeons Problem: పావురాల బెడదతో విసిగిపోయారా..? ఈ చిట్కాలతో సింపుల్ గా సమస్యకు చెక్ పెట్టండి ఇలా.!