తెలంగాణ విద్యాశాఖ నేడు పదో తరగతి పరీక్షల ఫలితాలు విడుదల చేసిన విషయం తెలిసిందే. అయితే.. పదో తరగతి పేపర్ లీకేజీ కేసులో డిబార్ అయిన విద్యార్థి హరీష్ ఫలితాలను అధికారులు హోల్డ్‌లో పెట్టారు. కాగా హన్మకొండ జిల్లా కమలాపూర్ స్కూల్లో పరీక్ష రాస్తున్న హరీష్ వద్ద నుంచే హిందీ పేపర్ తీసుకుని నిందితులు వాట్సాప్‌లో పంపారని అధికారులు తేల్చారు. దీంతో హరీష్‌ను డిబార్ చేశారు అధికారులు. కోర్టు అనుమతి తీసుకుని హరీష్ పరీక్షలు రాశాడు. అయితే నేడు వెలువరించిన ఫలితాల్లో హరీష్ రిజల్ట్‌ను హోల్డ్‌లో పెట్టారు. ఇదిలా ఉంటే.. విద్యార్థి హరీష్ రిజల్ట్ హోల్డ్ లో పెట్టడంతో విద్యాశాఖ మంత్రి సబితా ఇంద్రారెడ్డిని ఎన్‌ఎస్‌యూఐ నాయకులు కలిశారు. విద్యార్థి హరీష్ ఫలితాలను ప్రకటించాలని సబితా ఇంద్రా రెడ్డి్కి ఎన్‌ఎస్‌యూఐ నాయకులు వినతిపత్రం అందజేశారు.
Also Read : Uttar Pradesh: బీజేపీ లీడర్ భర్తను చితకబాదిన సమాజ్‌వాదీ ఎమ్మెల్యే.. వీడియో వైరల్..
