NTV Telugu Site icon

Narsaraopet Tension: టీడీపీ వర్సెస్ వైసీపీ …నరసరావుపేటలో ఉద్రిక్తత

Tdp Vs Ycp

Tdp Vs Ycp

ఏపీలో రాజకీయాలు ఎన్నికలకు ముందే వేడెక్కుతున్నాయి. పల్నాడు జిల్లా నరసరావుపేటలో ఉద్రిక్తత చోటుచేసుకుంది. పల్నాడు ప్రాంతంలో జరుగుతున్న దాడులు, హత్యలపై బహిరంగ చర్చకు సిద్ధమని సవాల్ విసిరారు టీడీపీ ఇన్చార్జ్ అరవింద్ బాబు. దీంతో అధికార పార్టీ నేతలు స్పందించారు. అధికార పార్టీ అండదండలతోనే దాడులు జరుగుతున్నాయని అరవింద్ బాబు ఆరోపించారు. ఈ ఆరోపణలపై కోటప్పకొండ వేదికగా చర్చకు సిద్ధమంటూ సవాల్ విసురుకున్నారు టిడిపి, వైసిపి నాయకులు. ఈ నేపథ్యంలో నేడు కోటప్పకొండ వెళ్లేందుకు సిద్ధమయ్యారు టీడీపీ నేత అరవింద్ బాబు.

Read Also: Smriti Mandhana : కెప్టెన్ గా పనికిరాదు?.. స్మృతి మంధాన అసంతృప్తి..!

కోటప్పకొండ వెళ్లేందుకు అనుమతులు లేవంటూ అరవింద్ బాబును హౌస్ అరెస్ట్ చేశారు పోలీసులు. దీంతో ఉద్రిక్తత చోటుచేసుకుంది. పోలీసులు భారీ బందోబస్తు ఏర్పాటుచేశారు. నరసరావుపేటకు ఎవరూ రావద్దని ఆదేశాలు జారీచేశారు. అయితే, టీడీపీ శ్రేణులు మాత్రం నరసరావుపేటకు వచ్చితీరతామంటున్నారు.నరసరావుపేట ప్రాంతం రొంపిచర్ల మండలం అలవల లో జరిగిన దాడి పై బహిరంగ చర్చకు రావాలని అధికార, ప్రతిపక్ష పార్టీలు సవాళ్లు ,ప్రతి సవాళ్లు విసురుకున్నాయి..

రొంపిచర్ల మండలం అలవలపాడు లో కోటిరెడ్డి పై జరిగిన దాడి వ్యవహారంలో తాను బహిరంగ చర్చకు సిద్ధమని టిడిపి చేస్తున్న ఆరోపణలపై ఆధారాలు ఉంటే తీసుకురావాలని ఎమ్మెల్యే గోపిరెడ్డి శ్రీనివాస్ రెడ్డి ఈనెల 13న సవాల్ విసిరారు.అయితే ఇదే అంశంపై ఈ నెల 20న టిడిపి ఇన్చార్జ్ అరవింద్ బాబు స్పందించారు… తాను ఉగాది రోజు కోటప్పకొండ త్రికోటేశ్వరుని సాక్షిగా బహిరంగ చర్చకు వస్తున్నారని వైసీపీ నేతలు రావాలని ప్రతి సవాల్ విసిరారు …..దీంతో పల్నాడు ప్రాంతం నరసరావుపేట లో ఉద్రిక్త పరిస్థితులు ఏర్పడ్డాయి.ఈ నేపథ్యంలో ఈరోజు కోటప్పకొండ వెళ్లేందుకు సిద్ధమవుతున్న టిడిపి నేతను పోలీసులు అడ్డుకొని హౌస్ అరెస్ట్ చేశారు ….. దీనిపై టిడిపి నేతలు స్పందిస్తూ తాము ఆరోపణలు చేసిన విధంగా ఎమ్మెల్యే చేస్తున్న అవినీతిపై ఎమ్మెల్యే అక్రమ ఆస్తులపై జరుగుతున్న అన్యాయాలపై బహిరంగ చర్చకు సిద్ధంగా ఉన్నామని ప్రకటించారు…

మరోవైపు నరసరావుపేట ఎమ్మెల్యే గోపిరెడ్డి శ్రీనివాస్ రెడ్డి సైతం తాను బహిరంగ చర్చకు సిద్ధమే అని అంటున్నారు …. రొంపిచర్ల మండలం అలవాల గ్రామంలో జరిగిన దాడి వ్యవహారంలో తాను ఎప్పుడైనా, ఎక్కడైనా బహిరంగ చర్చకు వస్తానని, పండుగ రోజు ప్రజలను అధికారులను ఇబ్బంది పెట్టడం భావ్యం కాదని , ఈరోజు తప్పించి ఎప్పుడైనా బహిరంగ చర్చకు వస్తానని అంటున్నారు. ఇలా ఇద్దరు రాజకీయ పార్టీల ప్రతినిధులు ,సవాళ్లు ప్రతి సవాళ్లు విసురుకోవటంతో నరసరావుపేటలో టెన్షన్ వాతావరణం ఏర్పడింది..

Read Also:Ukraine: ఉక్రెయిన్ లో జపాన్ ప్రధాని కిషిడా ఆకస్మిక పర్యటన