Kantara Chapter1 : సినిమా బడ్జెట్ మొత్తం ఓటీటీ డీల్ తో రికవరీ చేసిన కాంతార
- Follow Us :
-
-
Add as a preferred
source on google
కన్నడ స్టార్ హీరో రిషబ్ శెట్టిని పాన్ ఇండియా స్థాయికి తీసుకెళ్లిన ఫిల్మ్ కాంతార. జీరో ఎక్స్ పెక్టేషన్స్ తో వచ్చిన ఈ సినిమా శాండిల్ వుడ్ టాప్ 5 హయ్యెస్ట్ గ్రాసర్ ఫిల్మ్స్‌లో ఒకటిగా నిలిచింది. రూ. 14 కోట్లతో తెరకెక్కిన ఈ సినిమా రూ. 400 కోట్లకు పైగా గ్రాస్ వసూళ్లను రాబట్టుకుంది. ఈ సినిమా బ్లాక్ బస్టర్ హిట్టుతో కాంతారా చాప్టర్ వన్ ప్రకటించారు మేకర్స్. ఈ సినిమాను అత్యంత ప్రెస్టిజియస్ ప్రాజెక్టుగా టేకప్ చేసిన రిషబ్ శెట్టి.. ఎన్ని సమస్యలొచ్చినా అధిగమించి.. చెప్పిన టైంకి మూవీని దించేస్తున్నాడు. అక్టోబర్ 2న ప్రపంచ వ్యాప్తంగా రిలీజౌతుంది కాంతార ప్రీక్వెల్.
Also Read : Today Winner : మిరాయ్ vs కిష్కింధపురి.. విన్నర్ ఎవరంటే.?
Also Read
కాంతార వన్‌ను 30 దేశాల్లో ఏడు భాషల్లో రిలీజ్ చేసేందుకు ప్లాన్ చేస్తోంది హోంబలే ఫిల్మ్స్. ఇంగ్లీష్, బెంగాలీ భాషల్లో కూడా రిలీజవుతోంది. ఇప్పటికే ఆయా భాషల్లో సినిమాను డిస్ట్రిబ్యూటర్ ఎవరు చేస్తున్నారో డీటైల్స్ పంచుకుంది టీం. అయితే కేరళలో ఈసినిమాకు చిక్కులొచ్చి పడ్డాయి. మాలీవుడ్‌లో పృధ్వీరాజ్ సుకుమార్ నిర్మాణ సంస్థ రిలీజ్‌కు ప్లాన్ చేసుకోగా.. డిస్ట్రిబ్యూషన్ సంస్థకు, ఎగ్జిబిట్యూర్లకు మధ్య రెవెన్యూ షేరింగ్ విషయంలో ఇష్యూ నడుస్తోందని సమాచారం. ఇప్పటి వరకు సమస్య సాల్వ్ కాలేదని తెలుస్తోంది. ఇక ఈ సినిమా ప్రమోషన్లలో భాగంగా పంజాబ్ సింగర్ దిల్జిత్ దోసంజ్‌తో సాంగ్ చేయించబోతుందని టాక్. కల్కిలో కూడా ఈ స్టార్ సింగర్‌తో ఓ ప్రమోషనల్ సాంగ్ చేయించారు నాగ్ అశ్విన్. ఇప్పుడు కాంతార ప్రీక్వెల్‌కు కూడా ప్లాన్ చేస్తున్నారట. ఇక ఈ సినిమా ఓటీటీ హక్కులను అమెజాన్ ప్రైమ్ కొనుగోలు చేసినట్లు సమాచారం. సుమారు 125 కోట్ల భారీ రేట్ పెట్టి కొనుగోలు చేసిందట. ఈ లెక్కన చూస్తే ఈ సినిమా బడ్జెట్ రికవరీ అయిపోయిందని తెలుస్తోంది. కాంతార తెరకెక్కించే సమయంలో ఈ సినిమాను తీసుకునేందుకు వెనకాడిన ఓటీటీ సంస్థలు.. ఇప్పుడు భారీ రేటు పెట్టి కొనుగోలు చేయడం చూస్తే.. ఇదే కదా నిజమైన విజయం అనిపించకమానదు. మరి రిషబ్ కష్టానికి సరైన ప్రతిఫలం దక్కుతుందో లేదో చూడాలి
తాజావార్తలు
-
Singeetam Srinivasa Rao: టాలీవుడ్లో విషాదం.. ప్రముఖ దర్శకుడు సింగీతం శ్రీనివాసరావు కన్నుమూత
-
Story Board : తెలుగు రాష్ట్రాల్లో కమ్ముకొస్తున్న తాగునీటి కొరత
-
Akbaruddin Owaisi : వచ్చే ఎన్నికల్లో పోటీ చేయను.. ఎంఐఎం ఎమ్మెల్యే అక్బరుద్దీన్ ఓవైసీ సంచలన వ్యాఖ్యలు
-
OTR: కౌన్ బనేగా ఎమ్మెల్సీ? ఆ లక్కీ లీడర్ ఎవరు?
-
Mad Sandhu: ప్రముఖ పంజాబీ ఇన్ఫ్లుయెన్సర్ దారుణహత్య.. నడిరోడ్డుపై కాల్చి చంపిన దుండగులు..
ట్రెండింగ్
-
National Boyfriend Day: మీ ప్రేమను మరింత స్పెషల్‌గా మార్చే సింపుల్ టిప్స్.!
-
Viral: అదనపు ఆదాయం కోసం ఆటో కొన్న సాఫ్ట్వేర్ ఉద్యోగి.. చివరికి ఏం జరిగిందో తెలుసా..
-
India Playing 11: ఇద్దరు హైదరాబాద్ ఆటగాళ్లకు ఛాన్స్.. వెస్టిండీస్‌తో చివరి వన్డేకు భారత్ తుది జట్టు ఇదే!
-
India vs Pakistan Final: భారత్, పాకిస్థాన్ ఫైనల్.. మ్యాచ్ రద్దయితే గోల్డ్ మెడల్ ఎవరికి?.. కీలక రూల్ ఇదే!
-
Rajasthani Dal Baati: నోట్లో వేస్తే కరిగిపోయే నెయ్యి బాటీలు, ఘాటైన దాల్ కాంబినేషన్ ఇలా చేయండి..!