NTV Telugu Site icon

Group-1 Aspirants : సచివాలయం దగ్గర ఉద్రిక్తత.. బండి సంజయ్‌ను అదుపులోకి తీసుకున్న పోలీసులు

Bandi Sanjay

Bandi Sanjay

నిరుద్యోగులపై పోలీసులు లాఠీ చార్జ్ చేయడాన్ని తీవ్రంగా ఖండించిన కేంద్ర మంత్రి బండి సంజయ్.. తాను అశోక్ నగర్ వచ్చి గ్రూప్-1 అభ్యర్థులకు మద్దతుగా నిలుస్తానని హామీ ఇచ్చారు. ఈ నేపథ్యంలోనే శనివారం ఉదయం హైదరాబాద్ చేరుకున్నారు బండిసంజయ్‌. పార్టీ కార్యకర్తలు, అనుబంధ సంస్థలతో కలిసి.. గ్రూప్-1 అభ్యర్థులతో పాటు వారికి మద్దతుగా నిరసనలో పాల్గొన్నారు. గ్రూప్‌1 అభ్యర్థులను పరామర్శించి సమస్యలను అడిగి తెలుసుకున్నారు బండి సంజయ్‌. అనంతరం గ్రూప్-1 అభ్యర్థులతో కలిసి సచివాలయానికి ర్యాలీగా బయలుదేరారు. పోలీసులు ర్యాలీని అడ్డుకోవడంతో వారితో బండి సంజయ్ వాగ్వాదానికి దిగారు. తాము సచివాలయానికి వెళ్లి తీరుతామని స్పష్టం చేశారు. అయితే.. ఈ నేపథ్యంలోనే సచివాలయం వైపు వెళ్తున్న నేపథ్యంలో ఉద్రిక్తత పరిస్థితులు నెలకొన్నాయి. ఈ క్రమంలోనే.. పోలీసులు, గ్రూప్‌-1 అభ్యర్థుల మధ్య తోపులాట జరిగింది. గ్రూప్‌-1 అభ్యర్థులకు మద్దుతుగా.. తెలుగు తల్లి ఫ్లైఓవర్‌ దగ్గరకు బీఆర్‌ఎస్‌ కార్యకర్తలు చేరుకున్నారు.. సచివాలయం వైపు బీఆర్‌ఎస్‌ నేతలు దూసుకెళ్లడంతో ఒక్కసారి గందరగోళ పరిస్థితి నెలకొంది.

Lanka Dinakar: 2047 స్వర్ణాంధ్ర సాధన చంద్రబాబు లక్ష్యం

ఈ సందర్భంలోనే.. కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి బండి సంజయ్‌ని పోలీసులు అదుపులోకి తీసుకుని, నాంపల్లి బీజేపీ కార్యాలయానికి తరలించారు. సచివాలయం వద్ద రోజులా వాహనాల రాకపోకలు ఉండటంతో.. ఈ గందరగోళం మధ్య ట్రాఫిక్‌కు తీవ్ర ఇబ్బందులు ఏర్పాడ్డాయి. భారీ ట్రాఫిక్‌ జాం కావడంతో.. పోలీసుటు ఇటు నిరసనకారులను, అటు ట్రాఫిక్‌ను కంట్రోల్‌ చేసే పనిలో పడ్డారు. అంతకు ముందు బండి సంజయ్‌ మీడియాతో మాట్లాడుతూ.. జీవో 29ను రద్దు చేయాలని డిమాండ్‌ చేశారు. ప్రభుత్వం రిజర్వేషన్ల వ్యవస్థను రద్దు చేయదలచుకుందా..? అని బండి సంజయ్‌ ప్రశ్నించారు. ప్రభుత్వం మొండిపట్టు వీడాలని బండి సంజయ్‌ వ్యాఖ్యానించారు. కోర్టును కూడా ప్రభుత్వం తప్పుదోవ పట్టిస్తోందని, హైకోర్టు తీర్పును గౌరవించాల్సిందే అని బండి సంజయ్‌ అన్నారు.

Wife Vs Husband: పబ్బుకు పోయి ఇరుక్కున్న భర్త.. ఇంటికి రా నీ సంగతి చెప్తా..