NTV Telugu Site icon

COVID 19 : ఢిల్లీలో కరోనా టెన్షన్.. ఆందోళనలో విద్యార్థుల తల్లిదండ్రులు

Covid 19 In Delhi

Covid 19 In Delhi

దేశంలో కరోనా మళ్లీ కలకలం రేపుతుంది. దీంతో ప్రజల్లో ఆందోళన అధికమవుతుంది. మరీ ముఖ్యంగా దేశ రాజధాని ఢిల్లీలో కరోనా కేసులు పెరుగుతున్నాయి. కోవిడ్ కేసుల పెరుగుదల గణనీయంగా ఉందని డాక్టర్లు తెలిపుతున్నారు. ఇదే విషయాన్ని ప్రస్తావిస్తూ నిపుణులు మాస్క్ లు తప్పనిసరిగా ధరించాలని సూచిస్తున్నారు.

Also Read : KTR letter to Centre: వైజాగ్ స్టీల్ ప్లాంట్ పై కుట్రలు ఆపండి! కేంద్రానికి కేటీఆర్ బహిరంగ లేఖ

ఢిల్లీలో కరోనా కేసులు పెరుగుతుండడంతో పాఠశాలల్లో కొత్త తరగుతులు ప్రారంభమయ్యాయి. ఇలాంటి పరిస్థితుల్లో తమ పిల్లల గురించి తల్లిదండ్రుల్లో మళ్లీ భయం మొదలైంది. పిల్లల చదువులతో పాటు ఆరోగ్యం విషయంలోనూ టెన్షన్ పడుతున్నారు. పాఠశాలలు మళ్లీ ఆన్ లైన్ లో నడుస్తాయా.. మాస్కులు తప్పనిసరి అవుతాయా పిల్లల ఆరోగ్యం సంగతేంటి అనే ప్రశ్నలు వస్తున్నాయి.

Also Read : Naatu Naatu Song : నాటు నాటు సాంగ్‌ కు ఆలియా భట్, రష్మిక స్టెప్పులు

పాఠశాలల పున: ప్రారంభమైనప్పుడు పిల్లలకు కరోనా వైరస్ సోకుతుందనే ఆందోళన మధ్య పేరెంట్స్ ఉన్నారు. ఆందోళన చెందాల్సిన అవసరం లేదని ఆరోగ్య నిపుణులు అంటున్నారు. వాతావరణంలో మార్పుల కారణంగా పిల్లల్లో దగ్గు, జలుబు, జ్వరం వంటి లక్షణాలు కనిపిస్తున్నాయని డాక్టర్లు చెబుతున్నారు. ఇలాంటి పరిస్థితుల్లో సాధారణ చికిత్సతో వారు త్వరగా కోలుకుంటున్నారు. అయితే కోవిడ్ వ్యాక్సిన్ వేయించుకోవడానికి అర్హులైన పిల్లలు తప్పనిసరిగా వ్యాక్సిన్ వేయించుకోవాలని సూచించారు. మాస్కులు ధరించడం, చేతులు కడుక్కోవడం, శానిటైజర్లు ఉపయోగించడం వంటి కోవిడ్ తగిన ప్రవర్తనను పాటించడం ముఖ్యమని ఆరోగ్య నిపుణులు అంటున్నారు.

Also Read : BJP Leader: హైవేపై జరిగిన కాల్పుల్లో బీజేపీ నాయకుడు హతం

పాఠశాలల యాజమాన్యాలు సైతం అవసరమైన అన్ని జాగ్రత్తలు తీసుకుంటున్నామని చెబుతున్నారు. కరోనా, ప్లూ రాకుండా అన్ని జాగ్రత్తలు తీసుకుంటున్నామని స్కూల్స్ యాజమాన్యాలు తెలిపుతున్నారు. పాఠశాలలో మెడికల్ రూమ్స్ ఏర్పాటు చేస్తున్నాట్లు తెలియజేస్తున్నారు. చిన్నారులకు ఏదైనా సమస్య వస్తే వెంటనే చికిత్స అందిస్తున్నామని తెలిపారు. అంతేకాకుండా సందర్శనలో వైద్యులు కూడా ఉంటారని.. వారు ఎప్పటికప్పుడు పిల్లల ఆరోగ్యాన్ని పరిశీలిస్తారని తెలియజేస్తున్నారు.

Also Read : Summer Holidays: హమ్మయ్య.. సెలవులు వచ్చేశాయోచ్చ్‌..

గడిచిన 24 గంటల్లో ఢిల్లీలో కొత్తగా 416 కరోనా పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. దాదాపు 7 నెలల తర్వాత రాజధానిలో 400కు పైగా కరోనా కేసులు నమోదయ్యాయి. గత ఏడాది ఆగస్టు 31 తర్వాత తొలిసారిగా బుధవారం 300 కేసులు వచ్చాయి. గడచిన 24 గంటల్లో కొత్తగా 416 పాజిటివ్ కేసులు పెరిగాయి. ఇదిలా ఉండగా.. భారత్ లో గత 24 గంటల్లో మూడు వేలకు పైగా పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు అప్రమత్తం అవుతున్నాయి.