Site icon NTV Telugu

Tirupati: నాగాలమ్మ ఆలయం కూల్చివేతపై స్పందించిన ప్రభుత్వం..

Tirupati

Tirupati

తిరుపతి రూరల్ (మం) దామినీడులో నాగాలమ్మ ఆలయం కూల్చివేతపై ప్రభుత్వం స్పందించింది. ప్రభుత్వ సూచన మేరకు ఆర్డీవో, డిఎస్పీ ఇరువురితో సమాలోచన జరిపారు. కూల్చి వేసిన ప్రాంగణాన్ని యధావిధిగా గ్రామస్థులకు వదిలేయాలని కృష్ణమూర్తి నాయుడుకి ఆదేశాలు జారీ చేశారు. నేలమట్టం చేసిన ప్రాంతంలోనే తిరిగి ఆలయాన్ని పునర్ నిర్మించాలని సూచించారు. నెలరోజుల్లో ఆలయ నిర్మాణాన్ని యధావిధిగా నిర్మిస్తానని కృష్ణమూర్తి నాయుడు అంగీకరించారు.

READ MORE: Israel-Iran war: ఇజ్రాయిల్ తర్వాతి టార్గెట్ పాకిస్తాన్.. ఇరాన్ ఘర్షణతో భయం..

కాగా.. నిన్న తిరుపతి రూరల్ మండలం దామినేడులో ఉద్రిక్తత చోటు చేసుకుంది. భూవివాద నేపథ్యంలో స్థానికంగా ఉన్న ఓ ఆలయాన్ని కృష్ణమూర్తినాయుడు అనే వ్యక్తి నేలమట్టం చేశారు. దీంతో ఆగ్రహానికి గురైన గ్రామస్థులు అడ్డుకున్నారు. కృష్ణమూర్తి వర్గం తిరగబడటంతో ఒక్కసారిగా గ్రామస్థులు సైతం మూకుమ్మడి దాడి చేశారు. ఇరువర్గాల మధ్య కర్రలు, రాళ్లతో పరస్పర దాడులు జరిగాయి. రంగంలోకి దిగిన పోలీసులు కృష్ణమూర్తినాయుడు, ఆయన అనుచరులను తిరుచానూరు స్టేషన్‌కు తరలించి దర్యాప్తు చేసి ఈ నిర్ణయానికి వచ్చారు.

READ MORE: Kubear Pre Release Event : నాకు, శేఖర్ కమ్ములకు తేడా అదే.. రాజమౌళి కామెంట్స్..

Exit mobile version