NTV Telugu Site icon

Religious Clash : మహారాష్ట్రలో మత ఘర్షణలు.. జల్గావ్ లో ఉద్రిక్తత

Religoin Clashes

Religoin Clashes

మహారాష్ట్రలోని జల్గావ్ జిల్లాలో హింసాత్మక ఘటనలు తగ్గుముఖం పట్టడం లేదు. రెండు రోజుల తర్వాత జల్గావ్ లో మళ్లీ రెండు వర్గాల మధ్య తీవ్ర ఘర్షణ జరిగింది. శనివారం విగ్రహాన్ని ధ్వంసం చేయడంపై రెండు వర్గాల మధ్య ఘర్షణ చెలరేగడంతో 12 మందిని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. జిల్లాలోని అతర్వాల్ గ్రామంలో గుర్తుతెలియని వ్యక్తులు విగ్రహాన్ని ధ్వంసం చేయడంతో గొడవలు జరుగుతున్నాయని జల్గాన్ ఎస్పీ ఎం రాజ్ కుమార్ తెలిపారు.

Also Read : Kakani Govardhan Reddy: చుక్కల భూములపై సీఎం చారిత్రాత్మక నిర్ణయం తీసుకున్నారు..

ఈ అల్లర్లపై సమాచారం అందిన వెంటనే పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని పరిస్థితిని అదుపులోకి తెచ్చారు. 12 మందిని అదుపులోకి తీసుకున్నారు. తదుపరి చర్యలు తీసుకుంటున్నాం అని ఎస్పీ తెలిపారు. మార్చ్ 30న మహారాష్ట్రలోని జల్గావ్ జిల్లాలో నమాజ్ సందర్భంగా మసీదు వెలుపల సంగీతం వినిపించే విషయంలో రెండు వర్గాల మధ్య జరిగిన ఘర్షణకు సంబంధించి 56 మందిని అరెస్ట్ చేసినట్లు పోలీసులు తెలిపారు.

Also Read : Revanth reddy: తీగలాగితే డొంక కదిలిందా?! మీకర్థమవుతోందా?

రెండు ఎఫ్ఐఆర్ లు నమోదే చేశామని ఎస్పీ రాజ్ కుమార్ తెలిపారు. ప్రస్తుతం ఆ ప్రాంతం అదుపులో ఉందని ఎస్పీ పేర్కొన్నారు. మసీదు వెలుపల మ్యూజిక్ ప్లే చేయడంపై రెండు వర్గాల మధ్య గొడవ జరిగిందని.. అది రాళ్లదాడికి దారి తీసిందని.. ఇది తీవ్ర ఘర్షణకు మారిందని పేర్కొన్నారు. శ్రీరామనవమి రోజున మహారాష్ట్ర, పశ్చిమ బెంగాల్, బీహార్, జార్ఖండ్ రాష్ట్రాల్లో హింసాత్మక ఘటనలు చోటు చేసుకున్న నేపథ్యంలో ఈ పరిణామం జరిగాయి.

Also Read : Love Holidays : ప్రేమించుకోండి అంటూ స్టూడెంట్స్ కు హాలిడేస్

బీహార్ లోని రోహ్తాస్ జిల్లాలోని ససారంలో శనివార్ం సాయంత్రం బాంబు పేలుడు సంభవించింది. ఈ పేలుడులో ఐదుగురికి గాయాలు కాగా.. వారిని బెనారస్ హిందూ యూనివర్సిటీ ఆస్పత్రికి తరలించారు. పేలుడుకు గల కారణాలు ఇంకా తెలియరాలేదని.. పోలీసులు అన్ని కోణాల్లో దర్యాప్తు చేస్తున్నారన్నారు. గాయపడిన వారిని బీహెచ్ యూ ఆస్పత్రికి తరలించారు. ప్రస్తుతం అన్ని కోణాల్లో పేలుడుకు గల కారణాలు తెలియరాలేదని ససారం డీఎం ధర్మేంద్ర కుమార్ తెలిపారు.

Show comments