హర్యానాలోని నుహ్ జిల్లాలో మరోసారి ఉద్రిక్త వాతావరణం నెలకొంది. నుహ్‌లోని లహర్‌వాడి గ్రామంలో శుక్రవారం పరస్పర విబేధాల కారణంగా రెండు పార్టీల మధ్య భారీ రాళ్ల దాడి జరిగింది. ఈ క్రమంలో 32 ఏళ్ల యువతి సజీవ దహనమైంది. యువతి మంటల్లో కాలిపోయింది. దీంతో ఆ ప్రాంతంలో ఉద్రిక్త వాతావరణం నెలకొంది. ఈ క్రమంలో అక్కడికి పోలీసు బలగాలు భారీగా చేరుకున్నాయి. ఆ ప్రాంతమంతా పోలీసు బలగాలతో మోహరించారు. సమాచారం ప్రకారం.. సుమారు ఏడు నెలల క్రితం నుహ్‌లోని లహర్‌వాడి గ్రామంలో భూ వివాదంపై రెండు పార్టీల మధ్య ఘర్షణ తలెత్తింది. ఈ హింసాత్మక ఘర్షణలో రిజ్వాన్ అనే 21 ఏళ్ల యువకుడు చనిపోయాడు. ఈ క్రమంలో.. నిందితులపై హత్యానేరం కింద పోలీసులు కేసు నమోదు చేసి జైలుకు తరలించారు. దీంతో యువకుడిపై హత్యాయత్నం చేసిన నిందితుల కుటుంబ సభ్యులు గ్రామం వదిలి పారిపోయారు.
Read Also: Kakinada Crime: వివాహిత పట్ల అసభ్య ప్రవర్తన.. చంపేందుకు మహిళ బంధువులు ప్లాన్!
సంఘటన జరిగిన ఏడు నెలల తర్వాత నిందితుల తరపు వ్యక్తులు పోలీసులను సంప్రదించి గ్రామంలో పునరావాసం కల్పించాలని అభ్యర్థించారు. అనంతరం పున్హానా పోలీస్ స్టేషన్ అధికారులు ఇరువర్గాలను పిలిచి అంగీకారం కల్పించారు. దీంతో.. నిందితుల తరఫు కుటుంబ సభ్యులు వారి ఇళ్లకు వెళ్లిపోయారు. అనంతరం.. పోలీసులు అక్కడి నుంచి వెళ్లిపోవడంతో ఇరువర్గాలు మళ్లీ గొడవకు దిగాయి. దీంతో.. ఇరువర్గాల మధ్య రాళ్ల దాడి జరిగింది. ఈ క్రమంలోనే షెహనాజ్ అనే యువతిపై పెట్రోల్ పోసి నిప్పంటించారు. దీంతో.. తీవ్రంగా కాలిపోయి షెహనాజ్ అనే మహిళ మృతి చెందింది. అయితే ప్రతీకారం తీర్చుకునేందుకే తమ కూతురిని సజీవ దహనం చేశారని యువతి కుటుంబ సభ్యులు చెబుతున్నారు.
Read Also: CM Revanth Reddy : మాదిగలకు సంబంధించి అనుకూల నిర్ణయం తీసుకుంటాం
రెండు వర్గాల మధ్య జరిగిన ఈ గొడవకు సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. ఇందులో మృతురాలి బంధువులు రాళ్లు రువ్వుతున్నారు. కొందరు మహిళలు మరికొందరు మహిళలపై పెట్రోలు చల్లడం కనిపించింది. ఈ ఘటనపై పోలీసులు మాట్లాడుతూ.. నిన్న ఒక యువతి అగ్నిప్రమాదంలో మరణించినట్లు తమకు సమాచారం అందిందని తెలిపారు. మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం ఆస్పత్రకి తరలించామని.. ఈ ఘటనపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నామని అన్నారు.
