NTV Telugu Site icon

Sharapova: పెళ్లికాకుండానే మగబిడ్డకు జన్మనిచ్చిన మాజీ స్టార్ ప్లేయర్

Sharapova

Sharapova

రష్యాకు చెందిన టెన్నిస్ మాజీ స్టార్ మరియా షరపోవా మగబిడ్డకు జన్మనిచ్చింది. అయితే ఇప్పటివరకు షరపోవాకు పెళ్లి కాలేదు. అయితే ఆమె పెళ్లి కాకుండానే తల్లి కావడంతో ఆమె అభిమానులు ఆశ్చర్యం వ్యక్తం చేస్తున్నారు. కాబోయే భర్త అలెగ్జాండర్ గిల్క్స్‌తో కలిసి కొంతకాలంగా ఆమె సహజీవనం చేస్తోంది. ఈ నేపథ్యంలోనే ఆమె జూలై 1వ తేదీన మగబిడ్డకు జన్మనిచ్చింది. ఈ విషయాన్ని స్వయంగా షరపోవా ఇన్‌స్టాగ్రామ్ ద్వారా తెలియజేసింది. తమ బాబుకు థియోడర్ అని పేరు పెట్టినట్లు షరపోవా వెల్లడించింది. థియోడర్ ఈ ప్రపంచంలోకి రావడం తమ చిన్ని కుటుంబానికి ఒక రివార్డింగ్ గిఫ్ట్ అని షరపోవా తెలిపింది.

Read Also: Cuddle Therapy: గంటసేపు కౌగిలించుకుంటే.. రూ.7వేలు ఇవ్వాల్సిందే

షరపోవా బ్రిటీష్ వ్యాపారవేత్త అలెగ్జాండర్ గిల్క్స్‌ను 2020 డిసెంబర్‌లో ఎంగేజ్‌మెంట్ చేసుకుంది. అదే ఏడాది ఫిబ్రవరిలో షరపోవా ప్రొఫెషనల్ టెన్నిస్‌కు వీడ్కోలు పలికింది. టెన్నిస్‌కు గుడ్‌బై చెప్పిన తర్వాత కాబోయే భర్తతో కలిసి డేటింగ్ చేస్తోంది. దీంతో ఈ ఏడాది ఏప్రిల్‌లో ప్రెగ్నెంట్ అని ఆమె ప్రకటించింది. 2004లో వింబుల్డన్‌, 2006లో యూఎస్ ఓపెన్‌, 2008లో ఆస్ట్రేలియా ఓపెన్‌, ఇక 2012, 2014లో ఫ్రెంచ్ ఓపెన్ గెలిచింది. ఐదు సార్లు గ్రాండ్‌స్లామ్ టైటిళ్లతో ఒకప్పుడు మారియా ష‌ర‌పోవా టెన్నిస్‌లో సెన్షేష‌న్ క్రియేట్ చేసింది.