NTV Telugu Site icon

Tragedy: విషాదం.. తండ్రి మందలించాడని పురుగుల మందు తాగిన పదేళ్ల బాలుడు

Suicide

Suicide

Tragedy: ఇటీవల కాలంలో చిన్న చిన్న విషయాలకే పిల్లలు మనస్తాపానికి గురవుతున్నారు. తల్లిదండ్రులు ఏదో అన్నారని బాధతో కఠిన నిర్ణయాలు తీసుకుంటున్నారు. కన్నవారికి కడుపుకోతను మిగిల్చి కానరాని లోకాలకు వెళ్లిపోతున్నారు. తాజాగా అలాంటి విషాద ఘటన కర్నూలు జిల్లా వెల్దుర్తి మండలం లక్ష్మీనగరంలో చోటుచేసుకుంది. తండ్రి మందలించాడని పదేళ్ల బాలుడు పురుగుల మందు తాగి ఆత్మహత్యకు పాల్పడ్డాడు. కుమారుడు ఎల్ల కృష్ణ 5 రోజులుగా స్కూల్‌కు వెళ్లక పోవడంతో తండ్రి శేఖర్ అతడిని మందలించాడు. తండ్రి మందలించాడని మనస్తపానికి గురై ఎల్ల కృష్ణ(10) పురుగుల మందు తాగేశాడు. గమనించిన తల్లిదండ్రులు వెంటనే 108 అంబులెన్స్‌లో కర్నూలుకు తరలించారు. చికిత్స పొందుతూ బాలుడు ఎల్ల కృష్ణ మృతి చెందాడు. బాలుడి మృతితో ఆ కుటుంబాన్ని విషాద ఛాయలు అలుముకున్నాయి.

Read Also: Students Suicide: తెలంగాణలో 24 గంటల వ్యవధిలో ఇద్దరు విద్యార్థులు ఆత్మహత్య..

Show comments