తమిళనాడులో పెను విషాదం చోటు చేసుకుంది. రాష్ట్రంలోని విరుదు నగర్ జిల్లా, శివకాశీ తాలూకా, రెంగపాలయం గ్రామంలో ఘోరమైన అగ్ని ప్రమాదం జరిగింది. గ్రామ శివార్లలో ఉన్న ఒక బాణా సంచా తయారీ కేంద్రం, దానికి ఆనుకుని ఉన్న బాణాసంచా విక్రయ కేంద్రంలో ఇవాళ (మంగళవారం) మధ్యాహ్నం ఈ ఫైర్ యాక్సిడెంట్ చోటు చేసుకుంది.
Read Also: Vamsi Krishna: రూమర్స్ ఆధారంగానే టైగర్ నాగేశ్వరరావు.. ఎందుకో తెలుసా?
అయితే, శివకాశీ తాలూకా, రెంగపాలయం గ్రామంలో కనిష్కర్ ఫైర్ వర్క్స్ పేరుతో ఒక బాణా సంచా తయారీ కేంద్రం నిర్వహిస్తున్నారు. ఈ కేంద్రానికి ముందు వైపు ఒక షాపు ఉంది. ఆ షాపులో బాణాసంచాలను అమ్ముతారు. ఇక, దీపావళి పండుగ దగ్గర పడుతుండడంతో పెద్ద ఎత్తున బాణాసంచాలను తయారు చేసి, నిల్వ ఉంచారు. ఇవాళ మధ్యాహ్నం ఆ షాపులో బాణాసంచా కొనుగోలు చేసిన కొందరు ఆ షాపు ముందే వాటిని కాల్చి వేశారు. దీంతో అనుకోకుండా ఓ ఫైర్ క్రాకర్ మండుతూ ఆ షాపులోకి దూసుకుపోయింది. దాంతో, ఒక్కసారిగా అందులోని బాణాసంచా పెద్ద ఎత్తున పేలింది. గంటకు పైగా, ఈ పేలుళ్లు కొనసాగినట్లు అక్కడి అధికారులు వెల్లడించారు.
Read Also: Banana Cultivation : అరటి కోతల్లో తీసుకోవాల్సిన జాగ్రత్తలు..
ఇక, ఈ ప్రమాదం జరిగిన వెంటనే స్థానికులు పోలీసులకు, అగ్నిమాపక సిబ్బందికి సమాచారం ఇచ్చారు. ఇంతలోనే ఫ్యాక్టరీలో మరో పేలుడు కూడా సంభవించింది.
ఈ ప్రమాదంలో ఆ ఫైర్ క్రాకర్ ఫ్యాక్టరీలో పని చేస్తున్న 10 మంది ప్రాణాలు కోల్పోయారు. పదుల సంఖ్యలో కార్మికులకు తీవ్రంగా గాయాలయ్యాయని స్థానిక పోలీసులు పేర్కొన్నారు. కాగా, ఘటనపై పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.