Site icon NTV Telugu

BlackMail: బ్లూ ఫిల్మ్ లో నటిస్తే పదిలక్షలు ఇస్తారన్న కీచకుడు.. వీడియో తీసి బ్లాక్ మెయిల్

Gang Rape

Gang Rape

BlackMail: ప్రభుత్వాలు ఎన్ని కఠిన చట్టాలు తీసుకొచ్చినా మహిళలపై అఘాయిత్యాలు ఆగడం లేదు. వాళ్ల అవసరాన్ని ఆసరాగా చేసుకుని దారుణాలకు ఒడిగడుతున్నారు కీచకులు. నమ్మించి అమ్మాయిల గొంతుకోస్తున్నారు. అర్థికంగా కష్టాల్లో ఉన్న ఓ యువతిని ఓ వ్యక్తి అలా నమ్మించి మోసం చేశారు. వెబ్ సిరీస్లో నటిస్తే పది లక్షలు ఇస్తారని చెప్పి రప్పించి డ్రింక్స్ లో మత్తుకలిపి వీడియోలు తీసి బ్లాక్ మెయిల్ కు దిగాడు. దీంతో ఆ మహిళ ఏం చేయాలో తెలియక పోలీసులను ఆశ్రయించింది.

Read Also:‘Dayaa’ web series: ఓటీటీలోకి JD చక్రవర్తి అరంగేట్రం.. హాట్ స్టార్‌లో తెలుగు వెబ్ సిరీస్ దయ.

వివరాల్లోకి వెళితే ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్రం విశాఖపట్నానికి చెందిన ఓ యువతి హైదరాబాదులో ఈవెంట్ మేనేజర్ గా చేస్తుంది. తనకు కొన్నాళ్ల క్రితం చెన్న కేశవ అనే వ్యక్తి పరిచయం అయ్యాడు. ఈ క్రమంలోనే ఆ మహిళకు ఆర్థిక కష్టాలు మొదలయ్యాయి. సాయం కోసం చెన్నకేశవను సంప్రదించగా ఓ సలహా ఇచ్చాడు. అంత పెద్దమొత్తం కావాలంటే అప్పుపుట్టదని.. కావాలంటే తాను చెప్పిన చోట వెబ్ సిరీస్ చేస్తే పది లక్షల రూపాయలు ఇస్తారని నమ్మబలికాడు. దీంతో అసలే కష్టాల్లో ఉన్న సదరు యువతి తను చేసేదేంలేక ఒప్పుకుంది.

Read Also:Minister Peddireddy: పుంగనూరులో గాయపడ్డ పోలీసులకు మంత్రి పెద్దిరెడ్డి పరామర్శ.. బాబుపై తీవ్ర ఆరోపణలు

దీంతో ఆ యువతిని పంజాగుట్టలోని ఒక హోటల్ కు పిలిపించాడు. ఆ సమయంలోనే తనకు కూల్ డ్రింకులో మత్తు మందు కలిపి ఇచ్చాడు. అది తాగిన తర్వాత మహిళ మత్తులోకి జారుకున్నాక నగ్న వీడియోలు తీశాడు చెన్న కేశవ. మత్తు నుంచి తేరుకున్నాక వీడియోలను చూపించి బ్లాక్ మెయిల్ చేసి డబ్బులు వసూళ్లు మొదలు పెట్టాడు. చెన్నకేశవ వేధింపులు తట్టుకోలేక సదరు యువిత పోలీసులను ఆశ్రయించి నిందితుడిపై ఫిర్యాదు చేసింది. పోలీసులు చర్యలు తీసుకునే పనిలో ఉన్నారు.

Exit mobile version