Ananthapur: ఫైర్ క్రాకర్స్ పై అనంతపురం జిల్లాలో తాత్కాలికంగా నిషేధం విధించారు. జిల్లా ఎస్పీ గౌతమిశాలి సిఫారసు మేరకు కలెక్టర్ వినోద్ కుమార్ ఉత్తర్వులు జారీ చేశారు. వచ్చే నెల ఆరో తేదీ వరకు టపాసుల తయారీ, కొనుగోలు, అమ్మకాలు, రవాణా వంటి వాటిపై కలెక్టర్ నిషేధం విధించారు. సాధారణ ఎన్నికల కౌంటింగ్ ప్రక్రియ ప్రశాంతంగా జరిగేందుకు చర్యలు తీసుకుంటున్నారు. కౌంటింగ్ సందర్భంగా జిల్లాలో శాంతిభద్రతలకు విఘాతం కలగకుండా ముందస్తు చర్యల్లో భాగంగా క్రాకర్స్‌పై నిషేధం విధించారు. ఎవరైనా ఉత్తర్వులు ఉల్లంఘిస్తే ఐపీసీ సెక్షన్ 436 కింద కఠిన చర్యలు తప్పవని హెచ్చరికలు జారీ చేశారు. ఏపీలో ఎన్నికల తర్వాత హింసాత్మక ఘటనలు చెలరేగిన సంగతి తెలిసిందే. జూన్ 4న కౌంటింగ్ సందర్భంగా ఎలాంటి అవాంఛనీయ ఘటనలు జరగకుండా పోలీసులు చర్యలు తీసుకుంటున్నారు. జిల్లాల్లో ఇప్పటికే అదనపు బలగాలను మోహరించారు. స్ట్రాంగ్‌రూమ్‌ల వద్ద మూడంచెల భద్రతను కూడా ఏర్పాటు చేశారు. ఈ నేపథ్యంలోనే తాజాగా అనంతపురం జిల్లాలో ఫైర్ క్రాకర్స్‌పై నిషేధం విధించారు.
Read Also: Viral News: స్నేహితులు ఛాలెంజ్ చేశారని చెరువులో దూకిన యువకుడు.. ఏం జరిగిందంటే..?