NTV Telugu Site icon

Tamil Nadu: కాంచీపురంలో కొట్టుకున్న ఆలయ పూజారులు.. వీడియో వైరల్

Viral Video

Viral Video

తమిళనాడులోని కాంచీపురంలో ఆలయ పూజారులు ఒకరి ఒకరు కొట్టుకున్నారు. అదేంటి.. పూజారులు కొట్టుకోవడమేంటని ఆశ్చర్యపోతున్నారా.. నిజమేనండీ. వారు కొట్టుకున్నది ఒక పాట పాడే విషయంలో. నిజానికి.. కాంచీపురంలోని వరదరాజ పెరుమాళ్ల ఆలయంలో కనుమ సందర్భంగా పార్వేట ఉత్సవ యాత్ర జరుగుతుంది. ఈ యాత్రకు పూజారులు భారీగా తరలి వస్తారు. కాగా యాత్రలో మొదటి పాట పాడే విషయంలో వివాదం తలెత్తింది. పూజారులు వడకలై, టెంకలైలు రెండు వర్గాలుగా విడిపోయి ఒకరిపై మరొకరు దాడి చేసుకున్నారు. అంతేకాకుండా.. చంపేస్తామంటూ వార్నింగులు కూడా ఇచ్చుకున్నారు.

Read Also: Pakistan attacks Iran: ఇరాన్‌పై పాక్‌ ప్రతీకార దాడి.. పలువురు ఉగ్రవాదులు హతం!

నడి రోడ్డులో అర్చకులు ఒకరిపై ఒకరు దాడి చేసిన సంఘటనను చూసిన ఆ ఫైటింగ్ దృశ్యాలను సెల్‌ఫోన్‌లో బంధించారు. దీంతో ఆ ప్రాంతంలో తీవ్ర ఉత్కంఠ నెలకొంది. మొత్తానికి భక్తులు, అధికారులు, పోలీసులు కలగజేసుకుని.. వివాదాన్ని తాత్కాలికంగా ముగింపు పలికి.. వేడుక నిర్వహించారు. ఈ వీడియో నెట్టింట వైరల్‌గా మారింది. గతంలో కూడా ఇలాంటి గొడవలు చాలానే జరిగాయి. వైకాసి బ్రహ్మోత్సవాల్లో గత రాత్రి జరిగిన హనుమంతు వాహనసేవ సమయంలో స్వామివారికి నైవేద్యంగా సమర్పించిన దోసె, వడ పంచుకునే విషయంలో ఉత్తరాది, దక్షిణాది వర్గాల మధ్య ఘర్షణ చోటుచేసుకుంది.

Read Also: Director Bobby: చిరు సినిమాను రవితేజ రిజెక్ట్ చేశాడు.. కథ నచ్చక వద్దు అంటే..