మధ్యప్రదేశ్ రాష్ట్రంలో ఉన్న ఉజ్జయిని మహంకాళేశ్వరం ఆలయంలో బస్మహారతి నిర్వహిస్తున్న సమయంలో అపశ్రుతి చోటు చేసుకుంది. హోలీ సందర్భంగా ఉజ్జయిని మహంకాళి ఆలయంలో ఉదయం సమయంలో బస్మహారతి ఇస్తుండగా.. మంగళహారతి పై రంగులు పొడి పడడంతో ఒక్కసారిగా మంటలు అంటుకున్నాయి. ఈ సంఘటనలో పూజారులతో సహా సేవకులు 14 మంది గాయపడ్డారు. మంటల్లో గాయపడిన వారిని హుటాహుటినా దగ్గర్లోనే ఆసుపత్రికి తరలించారు. వారిలో ఎనిమిది మందిని మెరుగైన చికిత్స కొరకు ఇందోర్ తరలించారు.
also read: Punganur: పుంగనూరులో వైసీపీకి షాక్..!
ఈ సంఘటనకు సంబంధించి ఉజ్జయిని కలెక్టర్ నీరజ్ కుమార్ మాట్లాడుతూ.. హోలీ పురస్కరించుకొని ఆలయంలోని గర్భగుడి వద్ద బస్మహారతి నిర్వహిస్తున్న సమయంలో ఈ ప్రమాదం జరిగిందని.. సాంప్రదాయంలో భాగంగా రంగుల పొడి చల్లుతున్న సమయంలో కర్పూరంపై అది పడటంతో మంట కాస్త నేలపై దొర్లి పెద్ద ఎత్తున ఎగిసినట్లు తెలిపారు. ఈ సంఘటనకు సంబంధించి ఆలయంలో ఉన్న సీసీ కెమెరాల ఆధారంగా విచారణ చేపడుతున్నట్లు ఆయన తెలిపారు. ఈ ఘటన జరిగిన సమయంలో గుడిలో పలువురు ప్రముఖులతో పాటు కొందరు భక్తులు కూడా ఉన్నట్లు అర్థమవుతుంది. కాకపోతే వారు కాస్త దూరంగా ఉండటం వల్ల ఈ ప్రమాదం నుంచి తప్పించుకున్నారు.
also read: Delhi: ప్రధాని ఇంటి ముట్టడికి ఆప్.. ఢిల్లీలో పోలీసుల ఆంక్షలు..
ప్రమాద ఘటన సంబంధించి విషయం తెలుసుకున్న ప్రధాని మోడీ సోషల్ మీడియా వేదికగా స్పందించారు. ఇలా జరగడం చాలా బాధాకరమైన విషయమని.. గాయపడిన వారు త్వరగా కోలుకోవాలని ప్రార్థిస్తున్నానని ఆయన చెప్పుకొచ్చారు. స్థానిక యంత్రాంగం వారిని కాపాడేందుకు అన్ని విధాలుగా సహాయం అందిస్తున్నారని ప్రధాని మోడీ తెలిపారు. అదేవిధంగా మధ్యప్రదేశ్ ముఖ్యమంత్రి మోహన్ యాదవ్ కూడా సోషల్ మీడియా వేదికగా విచారణ వ్యక్తం చేశారు.