INDW vs SAW: బెంగళూరు వేదికగా జరిగిన రెండో వన్డేలో భారత మహిళల జట్టు ఉత్కంఠభరితంగా సాగిన మ్యాచ్‌లో దక్షిణాఫ్రికా మహిళల టీమ్ పై 4 పరుగుల తేడాతో గెలిచి 3 మ్యాచ్‌ల సిరీస్‌లో 2-0తో సిరీస్ కైవసం చేసుకుంది. ఇక, తొలుత బ్యాటింగ్ చేసిన టీమిండియా నిర్ణయ 50 ఓవర్లలో మూడు వికెట్ల నష్టానికి 325 పరుగులు చేసింది. టార్గెట్ ఛేదనకు దిగిన దక్షిణాఫ్రికా జట్టు మొత్తం 50 ఓవర్లు ఆడి 6 వికెట్లు కోల్పోయి 321 పరుగులు మాత్రమే చేసింది.
Read Also: MSP: రైతులకు కేంద్రం గుడ్‌న్యూస్.. 14 ఖరీఫ్ పంటలకు మద్దతు ధర పెంపు..
ఇక, టాస్ ఓడి తొలుత బ్యాటింగ్ చేసిన భారత్ నిదానంగా బ్యాటింగ్ ఆరంభించి తొలి 10 ఓవర్లలో వికెట్ నష్టపోకుండా 28 రన్స్ మాత్రమే చేసింది. 12వ ఓవర్‌లో టీమిండియా షఫాలీ వర్మ (20)ను నోంకులులేకో మ్లాబా ఔట్ చేసింది. ఒకవైపు నుంచి స్మృతి మంధాన, డేలాన్ హేమలత (24)తో కలిసి స్కోరును 100కు చేర్చింది. అలాగే, 23వ ఓవర్‌లో హేమలత వికెట్ పడింది, ఆపై వైస్ కెప్టెన్ మంధాన, కెప్టెన్ హర్మన్‌ప్రీత్ కౌర్‌లు రెచ్చిపోయి బ్యాటింగ్ చేయడంతో తలో సెంచరీ చేశారు. దీంతో భారత జట్టు స్కోర్ 325 పరుగులకు చేరుకుంది.
Read Also: Health Tips: షుగర్ వ్యాధిగ్రస్తులు గుడ్లు తినొచ్చా.. తింటే ఏమౌతుంది?
కాగా, లక్ష్యాన్ని ఛేదించిన దక్షిణాఫ్రికాకు మంచి ఆరంభం లభించలేదు.. జట్టుకు ఆరంభంలోనే ఎదురుదెబ్బలు తగిలాయి. 15వ ఓవర్‌లోనే కీలకమైన మూడు వికెట్లు నష్టపోయి 67 పరుగులు చేసింది. ఇక్కడి నుంచి లారా వోల్‌వార్ట్‌తో కలిసి మారిజానే కాప్ చెలరేగడంతో నాలుగో వికెట్‌కు 184 పరుగుల భాగస్వామ్యాన్ని నెలకొల్పారు. మారిజానే తన సెంచరీ పూర్తి చేసిన తర్వాత చేసిన ఈ ప్రమాదకరమైన జోడిని దీప్తి శర్మ విడదీసింది. అయితే, వోల్వార్డ్ సైతం వికెట్లు పడుతున్న కూడా శతకాన్ని బాదేసింది.
Read Also: AP Ministers: రేపు బాధ్యతలు స్వీకరించనున్న ఎనిమిది మంది మంత్రులు..
అయితే, దక్షిణాఫ్రికా విజయానికి చివరి ఓవర్‌లో 11 పరుగులు చేయాల్సి ఉంది. పూజా వస్త్రాకర్ తొలి 2 బంతుల్లో 5 పరుగులు ఇచ్చినా మూడో బంతికి నాడిన్ డి క్లెర్క్ (28), నాల్గో బంతికి నొందుమిసో షాంగ్సే (0)ను అవుట్ చేసింది. ఐదో బంతికి 1 రన్ వచ్చింది.. ఇక, చివరి బంతికి 5 పరుగులు అవసరం అయితే.. దాన్ని పూజా డాట్ బాల్ వేయడంతో దక్షిణాఫ్రికా ఓటమిని చవిచూడాల్సి వచ్చింది. ఇక, వోల్వార్ట్ 135 పరుగులతో అజేయ ఇన్నింగ్స్ ఆడగా.. భారత్ తరఫున పూజా వస్త్రాకర్, దీప్తి శర్మ తలో రెండు వికెట్లు తీశారు.