NTV Telugu Site icon

PKL 11: ఉత్కంఠపోరులో తెలుగు టైటాన్స్‌ విజయం..

Tt

Tt

ప్రో కబడ్డీ సీజన్ 11లో భాగంగా.. ఈరోజు తెలుగు టైటాన్స్- పుణేరి పల్టాన్ మధ్య మ్యాచ్ జరిగింది. హైదరాబాద్‌లోని గచ్చిబౌలి ఇండోర్ స్టేడియంలో జరిగిన ఉత్కంఠపోరులో తెలుగు టైటాన్స్ విజయం సాధించింది. ఈ మ్యాచ్‌లో 34-33 పాయింట్ల తేడాతో టైటాన్స్ గెలుపొందింది.

Read Also: Donald Trump: ట్రంప్ రాకతో బంగ్లాదేశ్‌లో అసలు “గేమ్” ప్రారంభం కానుందా..?

మ్యాచ్ ప్రారంభం నుంచి నువ్వా నేనా అన్నట్లుగా సాగింది. ఫస్టాఫ్‌ ముగిసే సరికి కూడా ఇరు జట్లు సమానంగా ఉన్నాయి. ఇక సెకండాఫ్‌లో రెండు జట్లలో ఏ జట్టు పాయింట్లు ఎక్కువగా సాధిస్తే.. ఆ జట్టు గెలుస్తుందని అనుకున్నప్పటికీ, సెకాండాఫ్‌లో కూడా చివరి వరకు పాయింట్లు సమానంగా వచ్చాయి. అయితే.. చివరకు ఒక్క పాయింట్ తేడాతో తెలుగు టైటాన్స్‌కు విజయం వరించింది. తెలుగు టైటాన్స్ జట్టులో విజయ్ మాలిక్ అత్యధికంగా 13 పాయింట్లు చేశాడు. అతనికి తోడు రైడర్ పవన్ సెహ్రావత్ 12 పాయింట్లతో రాణించాడు. పుణేరి పల్టాన్ జట్టులో పంకజ్ మోహితే 9, అజిత్ కుమార్ 6, మోహిత్ గోయత్ 5 పాయింట్లు చేశారు. తెలుగు టైటాన్స్ జట్టులో ఎక్కువగా రైడ్ పాయింట్లు ఉండటంతో విజయం సాధించింది.

Read Also: Ram Narayan: ప్రముఖ లెజెండరీ సారంగి ప్లేయర్ రామ్ నారాయణ్ కన్నుమూత

Show comments