Site icon NTV Telugu

Weather Updates : తెలుగు రాష్ట్రాల్లో వడగాల్పులు.. పలు జిల్లాలకు రెడ్, ఆరెంజ్ అలర్ట్

Temperature

Temperature

Weather Updates : తెలుగు రాష్ట్రాలైన తెలంగాణ, ఆంధ్రప్రదేశ్‌లో వడగాల్పుల తీవ్రత కొనసాగుతోంది. ముఖ్యంగా ఉత్తర తెలంగాణ జిల్లాల్లో నేడు వడగాలులు తీవ్రంగా ఉండే అవకాశం ఉందని వాతావరణ శాఖ హెచ్చరించింది. తెలంగాణలోని పలు జిల్లాలు వడగాల్పుల ప్రభావంతో అల్లాడుతున్నాయి. వాతావరణ శాఖ ఏకంగా 7 జిల్లాలకు రెడ్ అలర్ట్‌ను జారీ చేసింది. ఈ జిల్లాలు ఆదిలాబాద్, కుమురంభీం, నిజామాబాద్, మంచిర్యాల, నిర్మల్, జగిత్యాల, సిరిసిల్ల. ఇక్కడ ఉష్ణోగ్రతలు అత్యధికంగా నమోదయ్యే అవకాశం ఉంది. మరో 21 జిల్లాలకు ఆరెంజ్ అలర్ట్‌ను జారీ చేయడంతో, ఈ ప్రాంతాల్లో కూడా వడగాల్పుల ప్రభావం తీవ్రంగా ఉండే సూచనలు కనిపిస్తున్నాయి. ప్రజలు అప్రమత్తంగా ఉండాలని అధికారులు సూచిస్తున్నారు.

RCB vs RR: ఎట్టకేలకు సొంతగడ్డపై విజయం.. ప్లేఆఫ్స్‌కు చేరువైన ఆర్సీబీ!

ఇక ఆంధ్రప్రదేశ్‌లోనూ వడగాల్పుల ప్రభావం అధికంగా ఉంది. నేడు రాష్ట్రంలోని 17 మండలాల్లో తీవ్రమైన వడగాలులు వీచే అవకాశం ఉందని అధికారులు తెలిపారు. మరో 21 మండలాల్లో వడగాల్పుల ప్రభావం ఉంటుందని పేర్కొన్నారు. అయితే, ఏపీ ప్రజలకు కాస్త ఊరట కలిగించే వార్త ఏంటంటే, రానున్న రెండు రోజుల్లో పిడుగులతో కూడిన వర్షాలు కురిసే అవకాశం ఉంది. దీనివల్ల వాతావరణం కాస్త చల్లబడే అవకాశం ఉంది. మొత్తానికి, తెలుగు రాష్ట్రాల్లో వడగాల్పుల తీవ్రత అధికంగా ఉండటంతో ప్రజలు అప్రమత్తంగా ఉండాలని, ముఖ్యంగా వృద్ధులు, పిల్లలు తగిన జాగ్రత్తలు తీసుకోవాలని అధికారులు సూచిస్తున్నారు. అత్యవసరమైతే తప్ప బయటకు రావద్దని, ఒకవేళ వస్తే గొడుగు, నీరు వెంట తీసుకెళ్లాలని హెచ్చరిస్తున్నారు. రానున్న వర్షాల కోసం ప్రజలు ఎదురుచూస్తున్నారు.

Telangana BJP అనుకున్నది సాధించగలిగిందా?

Exit mobile version