Site icon NTV Telugu

Banakacherla Project: నేడు తెలుగు రాష్ట్రాల ముఖ్యమంత్రుల సమావేశం!

Telugu States Cms Meeting

Telugu States Cms Meeting

నేడు తెలుగు రాష్ట్రాల ముఖ్యమంత్రుల సమావేశం జరగనుంది. కేంద్ర జలశక్తి శాఖ మంత్రి సీఆర్ పాటిల్ ఆధ్వర్యంలో తెలుగు రాష్ట్రాల ముఖ్యమంత్రుల సమావేశం జరగనుంది. మధ్యాహ్నం 2.30 గంటలకు కేంద్ర జల శక్తి కార్యాలయంలో తెలుగు రాష్ట్రాల సీఎంలు భేటీ కానున్నారు. ఈ సమావేశంలో ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు, తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సహా రెండు రాష్ట్రాల ఇరిగేషన్ మంత్రులు, ఉన్నతాధికారులు పాల్గొననున్నారు.

సమావేశ ఎజెండాలో గోదావరి-బనకచర్ల ప్రాజెక్టు అంశం పక్కన పెట్టాలని జలశక్తి శాఖ కార్యదర్శికి తెలంగాణ సీఎస్ లేఖ రాసింది. కృష్ణా, గోదావరి బేసిన్లలో తెలంగాణకు సంబంధించి పెండింగ్‌లో ఉన్న అంశాలను చర్చించి పరిష్కరించాలని జలశక్తి శాఖ మంత్రికి మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి లేఖ రాశారు. నిన్న రాత్రి అమిత్ షాతో జరిగిన సమావేశంలో పోలవరం-బనకచర్ల ప్రాజెక్టుపై ఏపీ సీఎం చంద్రబాబు కీలక వ్యాఖ్యలు చేశారు. కరువు ప్రాంతమైన రాయలసీమకు నీరు అందించడం కోసమే పోలవరం బనకచర్ల ప్రాజెక్టు అని పేర్కొన్నారు. సముద్రంలోకి వృధాగా పోతున్న నీటిని ఉపయోగించుకోవడానికి మనకు బనకచర్ల ప్రాజెక్టు అని చెప్పారు.

Also Read: YS Jagan: నేడు వైఎస్ జగన్ కీలక ప్రెస్‌మీట్.. సర్వత్రా నెలకొన్న ఆసక్తి!

రూ.81,900 కోట్ల అంచనా వ్యయంతో పోలవరం నుంచి కర్నూలు జిల్లా బనకచర్ల రెగ్యులేటర్ వరకూ 200 టీఎంసీల వరద నీటిని తరలించేలా ఈ లింక్ ప్రాజెక్టు ప్రతిపాదించినట్లు వివరించిన ఏపీ సీఎం చంద్రబాబు వివరించారు. గోదావరి నదిలో ఎగువ, దిగువ రాష్ట్రాల నీటి అవసరాలు తీర్చిన తర్వాత కూడా 90 నుంచి 120 రోజుల మిగులు నీరు ఉందని సీఎం చెప్పారు. చివరి రాష్ట్రంగా గోదావరి మిగులు జలాలను పూర్తిగా వినియోగించుకునే హక్కు ఏపీకి ఉందని సీఎం చంద్రబాబు స్పష్టం చేశారు.

Exit mobile version