Bus Accidents: తెలుగు రాష్ట్రాల్లో వరుస బస్సు ప్రమాదాలు ఆందోళన కలిగిస్తున్నాయి. ఇవాళ ఉదయం ఒకే రోజు మూడు ట్రావెల్స్ బస్సుల ప్రమాదాలు చోటు చేసుకున్నాయి. శ్రీ సత్యసాయి జిల్లా చెన్నే కొత్తపల్లి మండలం దామరాజు పల్లి దగ్గర జబ్బార్ ట్రావెల్స్ బస్సు ఓ ట్రక్కును ఢీ కొట్టింది. ఈ ఘటనలో బెంగుళూరుకు చెందిన ఓ మహిళ మరణించగా మరో 8 మంది గాయపడ్డారు. ఈ బస్సు బెంగళూరు నుంచి హైదరాబాద్ వస్తోంది.
READ MORE: Nalgonda: దేవుడా..! మరో రోడ్డు ప్రమాదం.. ప్రైవేట్ ట్రావెల్స్ బస్సులో 45 మంది ప్రయాణికులు..
మరోవైపు.. నల్గొండ జిల్లా వేములపల్లి మండలం బుగ్గబావిగూడెం వద్ద అద్దంకి-నార్కెట్పల్లి హైవేపై మంగళవారం ఉదయం రోడ్డు ప్రమాదం చోటు చేసుకుంది.. ప్రైవేట్ ట్రావెల్ బస్సు ట్రాక్టర్‌ను వెనుక నుంచి ఢీ కొట్టింది. దీంతో ట్రాక్టర్ రోడ్డుపై బోల్తా పడింది. ఈ ప్రమాదంలో ట్రాక్టర్‌లో ప్రయాణిస్తున్న నలుగురికి గాయాలయ్యాయి.. క్షతగాత్రులను మిర్యాలగూడ ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. ఏలూరు జిల్లా లింగపాలెం మండలం జూబ్లీనగర్‌లో మరో బస్సు ప్రమాదం జరిగింది. భారతి ట్రావెల్స్‌కి చెందిన బస్సు బోల్తా పడింది. ఈ ప్రమాదంలో ఒకరు మృతి చెందారు. పది మందికి గాయాలయ్యాయి.
READ MORE: RazeshDanda : మీడియాకు, వెబ్ సైట్ నిర్వాహకులకు క్షమాపణలు చెప్పిన K RAMP నిర్మాత
