NTV Telugu Site icon

Ongole Crime: ఒంగోలులో కలకలం.. తెలుగు రైతు రాష్ట్ర అధ్యక్షుడిపై కత్తితో దాడి..

Mareddy Srinivas Reddy

Mareddy Srinivas Reddy

Ongole Crime: ప్రకాశం జిల్లా ఒంగోలులో తీవ్ర కలకలం రేగింది.. తెలుగు రైతు రాష్ట్ర అధ్యక్షుడు మర్రెడ్డి శ్రీనివాసరెడ్డిపై కత్తితో దాడి చేశారు.. ఒంగోలు జిమ్స్ ఆస్పత్రిలో ఈ ఘటన జరిగింది.. ఆర్థిక వివాదాల నేపథ్యంలో మర్రెడ్డి శ్రీనివాసరెడ్డిపై కత్తితో దాడి చేశాడు ఒంగోలో జిమ్స్‌ ఆస్పత్రి ప్రధాన వైద్యుడు మర్రెడ్డి రామచంద్రారెడ్డి.. ఇదంతా ప్రీప్లాన్‌తో చేసినట్టుగా తెలుస్తోంది.. ఈ దాడిలో తీవ్రంగా గాయపడిన శ్రీనివాసరెడ్డిని సంఘమిత్ర ఆస్పత్రికి తరలించారు. అయితే, గత కొద్ది రోజులుగా మర్రెడ్డి శ్రీనివాసరెడ్డి, మర్రెడ్డి రామచంద్రారెడ్డి మధ్య ఆర్థిక వ్యవహారాలు గొడ జరుగుతున్నాయి.. ఆ వివాదాలను పరిష్కరించుకుందామంటూ జిమ్స్‌కి శ్రీనివాస్‌రెడ్డిని పిలిచిన రామచంద్రారెడ్డి.. ఒక్కసారిగా కత్తితో దాడికి దిగడం కలకలం రేపుతోంది. ఈ ఘటనలో గాయపడ్డి శ్రీనివాసరెడ్డి పరిస్థితి విషమంగా ఉన్నట్టు చెబుతున్నారు.. ఈ ఘటనకు సంబంధించిన పూర్తి సమాచారం తెలియాల్సి ఉంది.

Read Also: Khattar Govt: హర్యానా ప్రభుత్వంపై అవిశ్వాస తీర్మానం.. 22న చర్చ