NTV Telugu Site icon

Pawan Kalyan: రేపు డిప్యూటీ సీఎం పవన్‌ కల్యాణ్‌తో సినీ నిర్మాతల భేటీ

Pawan Kalyan

Pawan Kalyan

Pawan Kalyan: రేపు(సోమవారం) మధ్యాహ్నం ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి కొణిదెల పవన్ కల్యాణ్‌ను విజయవాడలోని క్యాంప్ ఆఫీసులో ప్రముఖ టాలీవుడ్ నిర్మాతలు కలవనున్నారు. కొత్తగా ఏర్పడిన కూటమి ప్రభుత్వాన్ని అభినందించి, తెలుగు చిత్ర పరిశ్రమ ఎదుర్కొంటున్న సమస్యలు పరిష్కరించే విధంగా సహకరించాలని పవన్ కల్యాణ్‌ను కోరనున్నారు. మరీ ముఖ్యంగా సినిమా టిక్కెట్ల రేట్ల విషయంలో వెసులుబాటు, థియేటర్ల సమస్యలు వంటి విషయాలు డిప్యూటీ సీఎంతో టాలీవుడ్ ప్రముఖ నిర్మాతలు చర్చించే అవకాశం ఉంది.

Read Also: Minister Gottipati Ravi: రామాపురం బీచ్‌లో వరుస ప్రమాదాలపై మంత్రి గొట్టిపాటి రవి సమీక్ష

పవన్ కల్యాణ్‌ను కలిసే వారిలో అశ్వినీదత్, హారిక హాసిని చినబాబు, మైత్రి మూవీ మేకర్స్ నవీన్ , రవిశంకర్, సితార ఎంటర్టైన్మెంట్స్ నాగవంశీ, పీపుల్స్ మీడియా విశ్వప్రసాద్, వివేక్, తెలుగు ఫిలిం ఛాంబర్ అధ్యక్షుడు దిల్ రాజు, దామోదర్ ప్రసాద్, బోగవల్లి ప్రసాద్, డి.వి.వి.దానయ్య తదితరులు ఉన్నారు..