Site icon NTV Telugu

Film Workers Strike: 17వ రోజు సమ్మె అప్డేట్.. ఫిల్మ్ ఛాంబర్ ప్రతినిధులతో ఫెడరేషన్ నాయకుల సమావేశం!

Film Industry Workers Strike

Film Industry Workers Strike

Film Workers Strike: తెలంగాణలో సినీ కార్మికుల సమ్మె 17వ రోజుకు చేరుకుంది. ఈ నేపథ్యంలో చర్చలు వేగం పుంజుకుంటున్నాయి. ఈరోజు ఉదయం 11 గంటలకు నిర్మాతలతో ఫిల్మ్ ఛాంబర్ అధ్యక్షుడు, కార్యదర్శులు సమావేశం కానున్నారు. అలాగే సాయంత్రం 4 గంటలకు ఫిల్మ్ ఛాంబర్ ప్రతినిధులు, ఫెడరేషన్ నాయకులు మరోసారి భేటీ అవనున్నారు. ఇప్పటికే నిన్న సాయంత్రం మూడు గంటలపాటు సాగిన ఫిల్మ్ ఛాంబర్, ఫెడరేషన్ చర్చలు స్పష్టమైన ఫలితం లేకుండా ముగిశాయి. నిర్మాతలు పెట్టిన రెండు కండిషన్ల విషయంలో ఇరు పక్షాల మధ్య ప్రతిష్ఠంభన కొనసాగుతోంది.

IND vs PAK: ఆసియా కప్‌లో భారత్–పాక్ మ్యాచ్ జరిగేది డౌటే?.. సునీల్ గావస్కర్ కీలక వ్యాఖ్యలు

ఇకపోతే, కృష్ణ నగర్ లో జరిగిన సినీ కార్మిక సంఘాల సమావేశంలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి పాలాభిషేకం చేశారు. చర్చలలో నిర్మాతలు కార్మికులకు పెంచి ఇచ్చే జీతం శాతం విషయంలో హామీ ఇస్తూ, డాన్సర్స్, ఫైటర్స్, టెక్నీషియన్ల యూనియన్లకు కూడా వేతనాల పెంపు ఉంటుందని భరోసా ఇచ్చారు. ఈరోజు సాయంత్రం జరగబోయే ఫెడరేషన్, ఫిల్మ్ ఛాంబర్ చర్చల్లో సమస్య పరిష్కారం అయ్యే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది. ఈ సమస్యలు సాఫీగా పరిష్కారమైతే గురువారం నుంచి యథావిధిగా షూటింగ్స్ ప్రారంభమయ్యే అవకాశం ఉందని సినీ వర్గాలు ఆశాభావం వ్యక్తం చేస్తున్నాయి.

Boycott Asia Cup: బాయ్‌కాట్‌ ఆసియా కప్.. పాక్తో మ్యాచ్ వద్దంటున్న ఫ్యాన్స్

Exit mobile version