Film Industry Workers Strike: సినీ పరిశ్రమలో కొనసాగుతున్న కార్మికుల సమ్మె ఆరో రోజుకు చేరింది. అయినా కానీ కార్మికుల డిమాండ్స్ ఇంకా ఓ కొలిక్కి రాలేదు. ఇది ఇలా ఉండగా.. నిర్మాత టీ.జి. విశ్వప్రసాద్ ఫెడరేషన్ నాయకులపై పెట్టిన కేసులతో పరిస్థితి మళ్లీ మొదటి దశకు చేరింది. నిర్మాతలకు, ఫెడరేషన్ వారికి మధ్య సయోధ్య కల్పించేందుకు కోఆర్డినేషన్ కమిటీ ప్రయత్నాలు చేస్తున్నా, పరిష్కారం కనిపించడం లేదు.
Road Accident: నెల్లూరులో ఘోర రోడ్డు ప్రమాదం.. ముగ్గురు మృతి.. మంత్రి తీవ్ర దిగ్భ్రాంతి..!
శుక్రవారం నాడు సినీ నిర్మాతలకు ఫిల్మ్ ఛాంబర్ కీలక ఆదేశాలు జారీ చేసింది. ఫిల్మ్ ఫెడరేషన్ ఏకపక్ష నిర్ణయాలతో సమ్మెకు పిలుపునిచ్చిందని.. కాబట్టి ఫెడరేషన్ సంఘాలతో ఎవరూ సంప్రదింపులు చేయరాదని సూచించింది. దీనితో స్టూడియో, అవుట్‌డోర్ యూనిట్ సభ్యులు ఫెడరేషన్ వారికి ఎలాంటి సేవలు అందించకూడదని, ఛాంబర్ తదుపరి ఆదేశాలు వచ్చే వరకు షూటింగ్స్ జరపవద్దని ఆదేశాలు జారీ చేసింది. ఇప్పటికే వేతనాల పెంపును సమ్మతిస్తూ షూటింగ్స్ కొనసాగిస్తున్న దాదాపు 12 సినిమాలున్నాయి. అయితే ఛాంబర్ అనుమతి లేకుండా, ఫెడరేషన్ అనుమతితో షూటింగ్స్ చేస్తున్న నిర్మాతలపై ఫిల్మ్ ఛాంబర్ అసహనం వ్యక్తం చేసింది. ఈ ఆదేశాలతో మొత్తం షూటింగ్స్ ఆగిపోనున్న పరిస్థితి నెలకొంది.
Tribals Attack: అటవీ అధికారులపై రెచ్చిపోయిన గిరిజనులు.. కళ్లలో కారం చల్లి, కర్రలతో దాడి!
ఈరోజు ఫిల్మ్ ఫెడరేషన్ అనుబంధ కార్మిక సంఘాల సమావేశం జరగనుంది. ఇందులో ఆదివారం జరగనున్న సినీ కార్మికుల ధర్నాపై చర్చించనున్నారు. అలాగే ఈరోజే మంత్రి కోమటి రెడ్డిని ఫెడరేషన్ నాయకులు కలిసే అవకాశం ఉంది. కార్మికుల సమస్యలకు పరిష్కారం దొరుకుతుందన్న నమ్మకం ఉన్న సమయంలో నిర్మాత టీ.జి. విశ్వప్రసాద్ ఫెడరేషన్ నాయకులపై కేసులు పెట్టడం పరిస్థితిని మరింత క్లిష్టం చేసింది. టీ.జి. విశ్వప్రసాద్ తీరు పట్ల సినీ కార్మికులు తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు. 4 ప్రతిపాదనలపై ఫెడరేషన్ నిర్ణయం చెబితేనే వేతన పెంపుపై ఒక నిర్ణయం తీసుకుంటామని నిర్మాతలు స్పష్టం చేశారు. ఇకపోతే ఆదివారం నాడు ఫెడరేషన్ ఆఫీస్ నుంచి ఫిల్మ్ ఛాంబర్ వరకు సినీ కార్మికులు ధర్నా నిర్వహించనున్నారు. ఈ సమ్మె ఏ దిశగా వెళ్తుందో, పరిష్కారం ఎప్పుడు లభిస్తుందో సినీ వర్గాలు ఆతృతగా ఎదురుచూస్తున్నాయి.