Site icon NTV Telugu

Telecom Charges: మరోసారి కాల్ ఛార్జీల బాదుడు?

Telecom Charges

Telecom Charges

ప్రస్తుతం వినియోగదారులకు భారంగా మారిన టెలికాం ఛార్జీలు మరోసారి పెరిగే అవకాశం కనిపిస్తున్నాయి. ప్రస్తుత ఆర్థిక సంవత్సరం ద్వితీయార్ధంలో జియో, ఎయిర్‌టెల్, వొడాఫోన్ ఐడియా మరో విడత టారిఫ్‌లు పెంచే అవకాశాలున్నాయి. ఈ మేరకు దేశీయ రేటింగ్ ఏజెన్సీ క్రిసిల్ ఒక నివేదికలో వెల్లడించింది. టెలికాం సంస్థలు తమ నెట్‌వర్క్, స్పెక్ట్రంపై ఇన్వెస్ట్ చేయాలంటే సగటున ప్రతి యూజర్‌పై వచ్చే ఆదాయాన్ని మరింత పెంచుకోవాల్సి ఉంటుందని… ఒకవేళ అలా చేయకపోతే సర్వీసుల్లో నాణ్యత లోపించే అవకాశం ఉందని క్రిసిల్ తన నివేదికలో అభిప్రాయపడింది.

Credit Card: డెబిట్ కార్డ్ కంటే క్రెడిట్ కార్డ్ ఉత్తమమా..?

కాగా మరోసారి ఛార్జీలు పెంచితే 2022-23లో టెలికాం సంస్థల ఆదాయాలు 20-25 శాతం మేర వృద్ధి చెందనున్నాయి. ఈ ఆర్థిక సంవత్సరంలో ఏఆర్‌పీయూ కేవలం 5 శాతం పెరిగిందని, అయితే ఇప్పటివరకు పెంచినది.. ద్వితీయార్ధంలో పెంచబోయేది కూడా కలిపితే యూజర్‌పై టెలికాం కంపెనీలకు ఆదాయం 15-20 శాతం మేర పెరగవచ్చని క్రిసిల్‌ అంచనా వేసింది. మరోవైపు ఇన్‌యాక్టివ్ యూజర్ల సంఖ్య తగ్గుతున్నా అదే సమయంలో యాక్టివ్ యూజర్ల సంఖ్య పెరగడం టెలికాం కంపెనీలకు ఊరటనిస్తోంది. 2021 ఆగస్టు-2022 ఫిబ్రవరి మధ్య జియో యూజర్ల సంఖ్య భారీగా పడిపోయింది. అయితే యాక్టివ్ యూజర్ల వాటా 94 శాతానికి పెరిగింది. అటు ఎయిర్‌టెల్ కనెక్షన్లు గత ఏడాదిలో 1.10 కోట్ల మేర పెరగ్గా.. యాక్టివ్‌ యూజర్ల వాటా 99 శాతానికి చేరింది.

Exit mobile version