Kaleru Venkatesh: ప్రతిపక్షాలు ఎన్ని కుట్రలు చేసినా రానున్న ఎన్నికల్లో బీఆర్ఎస్ పార్టీ తిరిగి అధికారంలోకి వస్తుందని, ముఖ్యమంత్రిగా కేసీఆర్ హ్యాట్రిక్ కొట్టబోతున్నారని అంబర్‌పేట్ బీఆర్ఎస్ పార్టీ ఎమ్మెల్యే అభ్యర్థి కాలేరు వెంకటేష్ ధీమా వ్యక్తం చేశారు. ఎన్నికల ప్రచారంలో భాగంగా బాగ్ అంబర్‌పేట్‌లోని బూర్జు గల్లి, దోబి గల్లి, పోచమ్మ బస్తి తదితర ప్రాంతాల్లో ఇంటింటికి తిరుగుతూ బీఆర్ఎస్‌కు ఓటు వేయాలని అభ్యర్థించారు.
Also Read: Asaduddin Owaisi: నువ్వు ఆర్‌ఎస్‌ఎస్ కీలుబొమ్మవి.. బీజేపీ- కాంగ్రెస్‌ల మధ్య ఎలాంటి తేడా లేదు
ప్రచారంలో బస్తీ వాసులు గులాబీ పూలతో పూల వర్షం కురిపిస్తూ స్వాగతం పలికారు. మహిళలు మంగళహారతులు పడుతూ ఎమ్మెల్యే కాలేరు వెంకటేష్‌కు స్వాగతం పలికారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ… అంబర్‌పేట్‌లో కాంగ్రెస్, బీజేపీలకు డిపాజిట్లు కూడా దక్కవని అన్నారు. కాంగ్రెస్ పార్టీ ప్రకటించిన ఆరు గ్యారెంటీలను ప్రజలు నమ్మే పరిస్థితిలో లేరని కాలేరు వెంకటేష్ అన్నారు. అయితే, ఎమ్మెల్యే కాలేరు వెంకటేష్ నియోజకవర్గంలో పర్యటిస్తున్న సమయంలో ఆయనకు ప్రజల నుంచి మంచి స్పందన వస్తుంది.. దీంతో ఈ మరోసారి అంబర్ పేటలో బీఆర్ఎస్ జెండా రెపరెపలాడుతుందని ఎమ్మెల్యే కాలేరు వెంకటేష్ ఆశాభావం వ్యక్తం చేశారు. బీఆర్ఎస్ పార్టీ గెలుపుతోనే నియోజకవర్గంలో అభివృద్ది సాధ్యం అవుతుందని ఆయన పేర్కొన్నారు.