Rain Alert: తెలంగాణలో భారీ వర్షాలు.. వాతావరణ శాఖ కీలక హెచ్చరికలు జారీ..
- తెలంగాణ వాతావరణ శాఖ కీలక హెచ్చరికలు జారీ..
- మార్చి 18 లేదా 19 తర్వాత భారీ వర్షాలు..
- అప్పటి వరకు తప్పని భానుడి భగభగలు
- Follow Us :
-
-
Add as a preferred
source on google
తెలంగాణ రాష్ట్రంలో రానున్న రోజుల్లో వాతావరణం అనూహ్యంగా మారనుంది. మార్చి మధ్య వరకు భానుడి భగభగలు కొనసాగనుండగా.. ఆ తర్వాత అకాల వర్షాలు పలకరించనున్నాయని వాతావరణ శాఖ (IMD) , వాతావరణ నిపుణులు హెచ్చరిస్తున్నారు. దీనికి సంబంధించిన పూర్తి వివరాలు ఇలా ఉన్నాయి.
ప్రస్తుతం రాష్ట్రవ్యాప్తంగా ఎండలు ముదిరిపోతున్నాయి. మార్చి 18వ తేదీ వరకు ఉష్ణోగ్రతలు సాధారణం కంటే ఎక్కువగా నమోదయ్యే అవకాశం ఉంది. ఖమ్మం, భద్రాద్రి కొత్తగూడెం, నల్గొండ, సూర్యాపేట వంటి జిల్లాల్లో ఉష్ణోగ్రతలు గరిష్టంగా 39 డిగ్రీల నుంచి 41 డిగ్రీల వరకు చేరవచ్చు. హైదరాబాద్ నగరంలో పగటి ఉష్ణోగ్రతలు 36 డిగ్రీల నుంచి 37 డిగ్రీల మధ్య నమోదు కానున్నాయి. మధ్యాహ్నం 12 నుండి 4 గంటల మధ్య ప్రజలు అనవసరంగా బయటకు రాకూడదని.. ముఖ్యంగా వృద్ధులు , చిన్నారులు జాగ్రత్తగా ఉండాలని అధికారులు సూచిస్తున్నారు. వేసవి తాపం నుంచి ఉపశమనం కలిగిస్తూ మార్చి 18 లేదా 19వ తేదీ తర్వాత రాష్ట్రవ్యాప్తంగా వర్షాలు కురిసే అవకాశం ఉంది. ఈసారి కురిసే వర్షాలు గత ఫిబ్రవరిలో వచ్చిన వానల కంటే తీవ్రంగా ఉండే అవకాశం ఉందని వెదర్ మ్యాన్ అంచనా వేస్తున్నారు.
Also Read
- JD Vance: వైట్ హౌస్‌లో అంతర్గత పోరు.. రిపబ్లికన్ పార్టీ ఓటమిపై జేడీ వాన్స్ సంచలన వ్యాఖ్యలు..
- Virat Kohli Birthday: 38వ ఏడాదిలోకి అడుగుపెట్టిన 'రన్ మెషిన్'.. కోహ్లీ 38 అరుదైన రికార్డులు ఇవే..
- గేమర్లకు అదిరిపోయే గుడ్ న్యూస్.. డిసెంబర్ 10న BGMI Air విడుదల.. 1.4 కోట్ల రిజిస్ట్రేషన్లతో రికార్డు..!
- AP MPTC, ZPTC Elections 2026 Live Updates: ఎంపీటీసీ, జడ్పీటీసీ ఎన్నికల పోలింగ్ లైవ్ అప్డేట్స్.. ఎన్నికలు బహిష్కరించిన గ్రామస్తులు!
ఉరుములు, మెరుపులతో కూడిన భారీ వర్షాలతో పాటు కొన్ని చోట్ల పిడుగులు పడే అవకాశం ఉంది. లోతట్టు ప్రాంతాల ప్రజలు అప్రమత్తంగా ఉండాలి. పంట కోత దశలో ఉన్న రైతులు ధాన్యం తడవకుండా ముందస్తు జాగ్రత్తలు తీసుకోవాల్సిన అవసరం ఉంది.
ఈ ఏడాది తెలంగాణలో వాతావరణ మార్పులు ఆందోళన కలిగిస్తున్నాయి. ఫిబ్రవరి రెండో వారం నుంచే వేసవి ఛాయలు మొదలవ్వడం, మళ్ళీ నెలాఖరులో అకాల వర్షాలు ముంచెత్తడం దీనికి నిదర్శనం. ఈ ఏడాది ఎల్-నినో ప్రభావం వల్ల సాధారణం కంటే ఎక్కువ రోజులు వడగాల్పులు వీచే అవకాశం ఉందని IMD పేర్కొంది. ఉష్ణోగ్రతల పెరుగుదల దృష్ట్యా రాష్ట్రంలోని పలు జిల్లాలకు ఎల్లో, ఆరెంజ్ అలర్ట్‌లను జారీ చేశారు. ఎండల వల్ల డీహైడ్రేషన్ బారిన పడకుండా నిమ్మరసం, కొబ్బరి నీళ్లు వంటి ద్రవపదార్థాలు ఎక్కువగా తీసుకోవాలని వైద్య నిపుణులు సూచిస్తున్నారు.
తాజావార్తలు
-
AP MPTC, ZPTC Elections 2026 Live Updates: ఎంపీటీసీ, జడ్పీటీసీ ఎన్నికల పోలింగ్ లైవ్ అప్డేట్స్.. ఎన్నికలు బహిష్కరించిన గ్రామస్తులు!
-
JD Vance: వైట్ హౌస్‌లో అంతర్గత పోరు.. రిపబ్లికన్ పార్టీ ఓటమిపై జేడీ వాన్స్ సంచలన వ్యాఖ్యలు..
-
Virat Kohli Birthday: 38వ ఏడాదిలోకి అడుగుపెట్టిన ‘రన్ మెషిన్’.. కోహ్లీ 38 అరుదైన రికార్డులు ఇవే..
-
గేమర్లకు అదిరిపోయే గుడ్ న్యూస్.. డిసెంబర్ 10న BGMI Air విడుదల.. 1.4 కోట్ల రిజిస్ట్రేషన్లతో రికార్డు..!
-
Sachin-Joe Root: అత్యధిక టెస్టు రన్స్ రికార్డుకు చేరువవుతున్న జో రూట్.. మనసులో మాట భయపెట్టిన సచిన్!
-
Explainer: UN రిపోర్ట్.. ఆ మరణాల్లో భారత్ టాప్!
ట్రెండింగ్
-
Jio Unlimited 5G Data: జియో బంపర్ ఆఫర్.. రూ.15 రీఛార్జ్‌తో రోజంతా అపరిమిత 5G ఇంటర్నెట్.!
-
WPL 2027 Schedule: క్రికెట్ ఫ్యాన్స్‌కు గుడ్ న్యూస్.. WPL 2027 షెడ్యూల్ విడుదల.. మ్యాచ్‌ల తేదీలు, వేదికల వివరాలివే..!
-
ICC ర్యాంకింగ్స్‌లో భారీ మార్పులు.. టాప్ ప్లేస్‌కు మిచెల్ స్టార్క్.. ఏడో స్థానానికి శ్రేయస్ అయ్యర్..!
-
Sanna Karam Pusa Recipe: ఆయిల్ పీల్చకుండా కరకరలాడే ‘సన్న కారపూస’.. పక్కా కొలతలతో ఈజీగా చేసేయండి ఇలా..!
-
Motichoor Laddu Recipe: దీపావళి స్పెషల్.. నోట్లో వేస్తే కరిగిపోయే ‘మోతిచూర్ లడ్డు’.. ఇంట్లోనే ఈజీగా చేసుకోండిలా..!