Site icon NTV Telugu

Telangana Weather Alert: రాబోయే 24 గంటలు భారీ వర్షాలు.. నాలుగు జిల్లాలకు రెడ్ అలెర్ట్

Telangana Weather

Telangana Weather

Telangana Weather Alert: రాబోయే 24గంటల పాటు తెలంగాణకు భారీ నుంచి అత్యంత భారీ వర్ష సూచన హైదరాబాద్ వాతావరణ కేంద్రం తాజాగా పేర్కొంది. ఇందులో భాగంగా నాలుగు జిల్లాలకు ఐఎండీ రెడ్ అలెర్ట్ జారీ చేసింది. జయశంకర్ భూపాలపల్లి, ములుగు, భద్రాద్రి కొత్తగూడెం, మహబూబాబాద్ జిల్లాలకు వాతావరణ శాఖ రెడ్ అలెర్ట్ జారీ చేసింది. ఈ జిల్లాల్లో అత్యంత భారీ వర్షాలు కురిసే అవకాశముందని పేర్కొంది. అలాగే 19 జిల్లాలకు ఆరెంజ్ అలెర్ట్ జారీ చేసింది ఐఎండీ. ఈ జిల్లాలో కూడా భారీ నుంచి అతిభారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని ఐఎండీ పేర్కొంది.

CM Revanth: మత ప్రాతిపదికన ఏ రిజర్వేషన్లు ఉండవు.. రాహుల్ గాంధీ సూచనలను అమలు చేయడమే మా లక్ష్యం..!

వీటితోపాటు మరో 10 జిల్లాలకు ఎల్లో అలెర్ట్ జారీ చేశారు. ఈ ప్రాంతాల్లో మోస్తరు నుంచి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని అధికారులు పేర్కొన్నారు. నేడు ఉమ్మడి వరంగల్, ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాల్లో అత్యంత భారీ వర్షాలు పడే అవకాశం ఉన్నదని వాతావరణ శాఖ పేర్కొంది. ఇప్పటికే ఉమ్మడి వరంగల్ జిల్లాలో అత్యంత భారీ వర్షాలు నమోదయ్యాయి. గత 24 గంటల్లో రాష్ట్రంలో మూడు ప్రాంతాల్లో అత్యంత భారీ, 12 ప్రాంతాల్లో అతి భారీ, 26 ప్రాంతాల్లో భారీ వర్షాలు నమోదయ్యాయి. ప్రజలు ఈ వాతావరణ పరిస్థితులకు అనుగుణంగా జాగ్రత్తలు తీసుకోవాలని అధికారులు సూచిస్తున్నారు.

Ramantapur Incident Ex-Gratia: మృతులకు రూ.5 లక్షల ఎక్స్‌గ్రేషియా ప్రకటన!

Exit mobile version