Telangana Weather Alert: రాబోయే 24 గంటలు భారీ వర్షాలు.. నాలుగు జిల్లాలకు రెడ్ అలెర్ట్
- రాబోయే 24గంటల పాటు తెలంగాణకు భారీ నుంచి అత్యంత భారీ వర్ష సూచన..
- నాలుగు జిల్లాలకు ఐఎండీ రెడ్ అలెర్ట్..
- జయశంకర్ భూపాలపల్లి, ములుగు, భద్రాద్రి కొత్తగూడెం, మహబూబాబాద్ జిల్లాలకు రెడ్ అలెర్ట్..
- 19 జిల్లాలకు ఆరెంజ్ అలెర్ట్ జారీ చేసిన ఐఎండీ..
- 10 జిల్లాలకు ఎల్లో అలెర్ట్..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Telangana Weather Alert: రాబోయే 24గంటల పాటు తెలంగాణకు భారీ నుంచి అత్యంత భారీ వర్ష సూచన హైదరాబాద్ వాతావరణ కేంద్రం తాజాగా పేర్కొంది. ఇందులో భాగంగా నాలుగు జిల్లాలకు ఐఎండీ రెడ్ అలెర్ట్ జారీ చేసింది. జయశంకర్ భూపాలపల్లి, ములుగు, భద్రాద్రి కొత్తగూడెం, మహబూబాబాద్ జిల్లాలకు వాతావరణ శాఖ రెడ్ అలెర్ట్ జారీ చేసింది. ఈ జిల్లాల్లో అత్యంత భారీ వర్షాలు కురిసే అవకాశముందని పేర్కొంది. అలాగే 19 జిల్లాలకు ఆరెంజ్ అలెర్ట్ జారీ చేసింది ఐఎండీ. ఈ జిల్లాలో కూడా భారీ నుంచి అతిభారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని ఐఎండీ పేర్కొంది.
CM Revanth: మత ప్రాతిపదికన ఏ రిజర్వేషన్లు ఉండవు.. రాహుల్ గాంధీ సూచనలను అమలు చేయడమే మా లక్ష్యం..!
Also Read
వీటితోపాటు మరో 10 జిల్లాలకు ఎల్లో అలెర్ట్ జారీ చేశారు. ఈ ప్రాంతాల్లో మోస్తరు నుంచి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని అధికారులు పేర్కొన్నారు. నేడు ఉమ్మడి వరంగల్, ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాల్లో అత్యంత భారీ వర్షాలు పడే అవకాశం ఉన్నదని వాతావరణ శాఖ పేర్కొంది. ఇప్పటికే ఉమ్మడి వరంగల్ జిల్లాలో అత్యంత భారీ వర్షాలు నమోదయ్యాయి. గత 24 గంటల్లో రాష్ట్రంలో మూడు ప్రాంతాల్లో అత్యంత భారీ, 12 ప్రాంతాల్లో అతి భారీ, 26 ప్రాంతాల్లో భారీ వర్షాలు నమోదయ్యాయి. ప్రజలు ఈ వాతావరణ పరిస్థితులకు అనుగుణంగా జాగ్రత్తలు తీసుకోవాలని అధికారులు సూచిస్తున్నారు.
Ramantapur Incident Ex-Gratia: మృతులకు రూ.5 లక్షల ఎక్స్‌గ్రేషియా ప్రకటన!
తాజావార్తలు
-
Singeetam Srinivasa Rao: టాలీవుడ్లో విషాదం.. ప్రముఖ దర్శకుడు సింగీతం శ్రీనివాసరావు కన్నుమూత
-
Story Board : తెలుగు రాష్ట్రాల్లో కమ్ముకొస్తున్న తాగునీటి కొరత
-
Akbaruddin Owaisi : వచ్చే ఎన్నికల్లో పోటీ చేయను.. ఎంఐఎం ఎమ్మెల్యే అక్బరుద్దీన్ ఓవైసీ సంచలన వ్యాఖ్యలు
-
OTR: కౌన్ బనేగా ఎమ్మెల్సీ? ఆ లక్కీ లీడర్ ఎవరు?
-
Mad Sandhu: ప్రముఖ పంజాబీ ఇన్ఫ్లుయెన్సర్ దారుణహత్య.. నడిరోడ్డుపై కాల్చి చంపిన దుండగులు..
ట్రెండింగ్
-
National Boyfriend Day: మీ ప్రేమను మరింత స్పెషల్‌గా మార్చే సింపుల్ టిప్స్.!
-
Viral: అదనపు ఆదాయం కోసం ఆటో కొన్న సాఫ్ట్వేర్ ఉద్యోగి.. చివరికి ఏం జరిగిందో తెలుసా..
-
India Playing 11: ఇద్దరు హైదరాబాద్ ఆటగాళ్లకు ఛాన్స్.. వెస్టిండీస్‌తో చివరి వన్డేకు భారత్ తుది జట్టు ఇదే!
-
India vs Pakistan Final: భారత్, పాకిస్థాన్ ఫైనల్.. మ్యాచ్ రద్దయితే గోల్డ్ మెడల్ ఎవరికి?.. కీలక రూల్ ఇదే!
-
Rajasthani Dal Baati: నోట్లో వేస్తే కరిగిపోయే నెయ్యి బాటీలు, ఘాటైన దాల్ కాంబినేషన్ ఇలా చేయండి..!