Current Charges Increased: విద్యుత్ వినియోగదారులకు బిగ్ షాక్.. పెరిగిన కరెంట్ ఛార్జీలు.. ఒక్కో యూనిట్‌కు ఎంతంటే..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
తెలంగాణలోని విద్యుత్ వినియోగదారులకు డిస్కంలు షాకిచ్చాయి. రాష్ట్రంలోని విద్యుత్ పంపిణీ సంస్థలైన ఎస్పీడీసీఎల్ (TGSPDCL), ఎన్పీడీసీఎల్ (TGNPDCL) పరిధిలో ట్రూ-అప్ ఛార్జీల వసూళ్లకు తెలంగాణ విద్యుత్ నియంత్రణ మండలి (టీజీఈఆర్సీ) అధికారికంగా అనుమతిస్తూ ఉత్తర్వులు జారీ చేసింది. గత ఆర్థిక సంవత్సరాలకు సంబంధించి విద్యుత్ కొనుగోలు వ్యయం, ఆదాయ వ్యత్యాసాల కారణంగా ఏర్పడిన ట్రూ-అప్ భారాన్ని వినియోగదారులపై మోపేందుకు రంగం సిద్ధమైంది.
ఈ నిర్ణయం ప్రకారం రాబోయే నవంబర్ నెల నుంచి వినియోగదారుల బిల్లులలో ట్రూ-అప్ ఛార్జీలు ప్రత్యక్షం కానున్నాయి. విద్యుత్ సంస్థలు నవంబర్ నెల నుంచి ఒక్కో యూనిట్‌పై 30 పైసల చొప్పున, డిసెంబర్ నుంచి యూనిట్‌కు 50 పైసల చొప్పున ఈ ఛార్జీలను వసూలు చేయనున్నాయి. అయితే.. వ్యవసాయ రంగానికి ప్రభుత్వం ఇస్తున్న ఉచిత విద్యుత్ విధానాన్ని కొనసాగిస్తూ… వ్యవసాయ కనెక్షన్లకు ఈ ట్రూ-అప్ ఛార్జీల నుంచి మినహాయింపు ఇచ్చారు.
Also Read
- Mumbai: ముంబై బస్ డిపోలో భారీ అగ్నిప్రమాదం.. కాలి బూడిదైన బస్సులు
- Plastic Bucket Cleaning Tips: ప్లాస్టిక్ బకెట్లపై జిడ్డు మరకలా? కొత్తదానిలా మెరిపించే సింపుల్ టిప్స్..
- Team India T20 Records: టీ20ల్లో భారత్‌కు ఈ రికార్డులు ఏంది భయ్యా..? వెస్టిండీస్‌తో మ్యాచ్‌కు పూనకాలే..
- Delhi: జర్నలిస్ట్‌పై లైంగిక వేధింపుల ఆరోపణలో బిగ్ ట్విస్ట్.. పోలీస్ బాస్‌కు ప్రమోషన్
మొత్తం రూ. 7,635.22 కోట్ల ట్రూ-అప్ మొత్తంలో… వ్యవసాయ రంగానికి సంబంధించిన రూ. 2,214.99 కోట్లను ప్రభుత్వమే భరించాలని ఈఆర్సీ స్పష్టం చేసింది. దీనికి సంబంధించి ఎస్పీడీసీఎల్ పరిధిలో రూ. 1,442.49 కోట్లు, ఎన్పీడీసీఎల్ పరిధిలో రూ. 772.50 కోట్లను ప్రభుత్వ సబ్సిడీ ద్వారా రాబట్టుకోవాలని డిస్కంలను ఆదేశించింది. ఇక మిగిలిన రూ. 5,420.23 కోట్లను (ఎస్పీడీసీఎల్ పరిధిలో రూ. 4,222.93 కోట్లు, ఎన్పీడీసీఎల్ పరిధిలో రూ. 1,197.30 కోట్లు) మాత్రం గృహ, వాణిజ్య తదితర ఇతర అర్హత కలిగిన విద్యుత్ వినియోగదారుల నుంచి వసూలు చేయనున్నారు.
ఈ వసూళ్ల ప్రక్రియను క్రమపద్ధతిలో అమలు చేయాలని ఈఆర్సీ స్పష్టం చేసింది. ఎస్పీడీసీఎల్ పరిధిలోని వినియోగదారులు 29 నెలల పాటు, ఎన్పీడీసీఎల్ పరిధిలోని వినియోగదారులు 26 నెలల పాటు ఈ ఛార్జీలను చెల్లించాల్సి ఉంటుంది. వినియోగదారుల బిల్లుల్లో ఈ ట్రూ-అప్ మొత్తాన్ని ప్రత్యేకంగా స్పష్టంగా ముద్రించాలని, ఇతర ఛార్జీలతో కలపకుండా ఏ ఆర్థిక సంవత్సరానికి ఆ సంవత్సరం వివరాలను విడిగా చూపాలని డిస్కంలను ఆదేశించారు. ఈ భారంపై వినియోగదారుల్లో ఆందోళన వ్యక్తమవుతోంది.
తాజావార్తలు
-
Current Charges Increased: విద్యుత్ వినియోగదారులకు బిగ్ షాక్.. పెరిగిన కరెంట్ ఛార్జీలు.. ఒక్కో యూనిట్‌కు ఎంతంటే..
-
Mumbai: ముంబై బస్ డిపోలో భారీ అగ్నిప్రమాదం.. కాలి బూడిదైన బస్సులు
-
Plastic Bucket Cleaning Tips: ప్లాస్టిక్ బకెట్లపై జిడ్డు మరకలా? కొత్తదానిలా మెరిపించే సింపుల్ టిప్స్..
-
Eye Health: తరచూ హెడేక్ వస్తోందా? ఎప్పుడు అలర్ట్ కావాలి? వైద్యుల సలహా ఇదే!
-
Team India T20 Records: టీ20ల్లో భారత్‌కు ఈ రికార్డులు ఏంది భయ్యా..? వెస్టిండీస్‌తో మ్యాచ్‌కు పూనకాలే..
ట్రెండింగ్
-
How to Make Murmura at Home: ప్రెజర్ కుక్కర్ ఉంటే చాలు.. ఇంట్లోనే కరకరలాడే బొరుగులు తయారు చేసుకోండి!
-
High-Protein Black Chana Soup: రాత్రిపూట తేలికైన, పౌష్టికమైన డిన్నర్.. నల్ల శనగల హై-ప్రోటీన్ సూప్ ట్రై చేయండి
-
Homemade Natural Lip Balm: ఖరీదైన లిప్ బామ్‌లకు చెక్.. ఇంట్లో ఉండే పదార్థాలతోనే సహజమైన లిప్ బామ్ రెడీ..!
-
How To Grow Mint Plant: ఒక్క పుదీనా కాడతో మొక్క పెంచేయొచ్చు.. ఈ సింపుల్ టిప్స్ పాటించండి
-
Chitti Punugulu: బయట కరకరలాడుతూ, లోపల దూదిలా ఉండే హోటల్ స్టైల్ “చిట్టి పునుగులు”.. ఇంట్లోనే పర్ఫెక్ట్ గా చేయండి ఇలా.!