Site icon NTV Telugu

New Excise Police Stations:14 కొత్త ఎక్సైజ్‌ పోలీస్‌ స్టేషన్లకు లైన్‌ క్లియర్‌.. ఒకటి నుంచి షురూ..

Tg News

Tg News

కొత్త ఎక్సైజ్‌ పోలీస్‌ స్టేషన్లకు లైన్‌ క్లియర్‌ అయ్యింది. తెలంగాణలో ఏప్రిల్‌ 1 నుంచి 14 ఎక్సైజ్‌ పోలీస్‌ స్టేషన్లు ప్రారంభం కానున్నాయి. కొత్తగా ఏర్పాటు కానున్న 14 ఎక్సైజ్‌ పోలీస్‌ స్టేషన్లలో హైదరాబాద్‌లో13, వరంగల్‌ అర్బన్‌లో ఒక స్టేషన్ ఏర్పాటు చేయనున్నారు. 2020లో 14 కొత్త ఎక్సైజ్‌ పోలీస్‌ స్టేషన్ల ఏర్పాటుకు ప్రతిపాదనలు జరిగాయి. కొత్త ఎక్సైజ్‌ పోలీస్‌ స్టేషన్ల విభజన, ప్రాంతాలు, బదలాయింపు పనులన్నీ ప్రస్తుతం పూర్తయ్యాయి.

READ MORE: Delimitation: జనాభా నియంత్రణ శాపం కాకూడదు.. అవసరమైతే పోరాట బాట పడుదాం: సీఎం రేవంత్

దీంతో కొత్త ఎక్సైజ్‌ పోలీస్‌ స్టేషన్ల ఏర్పాటుకు ప్రభుత్వ అనుమతులు, ప్రొహిబిషన్‌ అండ్‌ ఎక్సైజ్‌ శాఖ మంత్రి జూపల్లి కృష్ణారావు, ప్రిన్సిపల్‌ సెకట్రరీ రిస్వి, ప్రొహిబిషన్‌ అండ్‌ ఎక్సైజ్‌ శాఖ కమిషనర్‌ చెవ్వూరు హరి కిరణ్‌ ఆమోద ముద్ర వేశారు. కొత్త పోలీస్‌ స్టేషన్లను ఏప్రిల్‌ ఒకటో తేదీ నుంచి విధులు నిర్వహించే విధంగా చర్యలు చేపట్టాలని ఎక్సైజ్‌ శాఖ అడిషనల్‌ కమిషనర్‌ అజయ్‌రావు.. ఆయా ఎక్సైజ్‌ డిప్యూటీ కమిషనర్లకు ఉత్తర్వులు జారీ చేశారు.

READ MORE: Sara Ali Khan : అలియాకు నేషనల్ అవార్డు రావడం.. అసూయగా అనిపించింది

కొత్త ఎక్సైజ్‌ పోలీస్‌ స్టేషన్లకు అద్దె భవనాలను గుర్తించాలని కమిషనర్‌ అదేశాలు ఇచ్చారు. కొత్తగా ఏర్పాటు కానున్న ఎక్సైజ్‌ పోలీస్‌స్టేషన్లకు బంజారా హిల్స్, చిక్కడ్‌పల్లి, గండిపేట్‌, కొండపూర్‌, పెద్ద అంబర్‌పేట్‌ , కూకట్‌పల్లి, అమీన్‌పూర్‌, హసన్‌పర్తి ఎక్సైజ్‌ పోలీస్‌ స్టేషన్లకు అద్దె భవనాల గుర్తింపు పూర్తయింది. అద్దె భవనాలు లభించని మారేడ్‌పల్లి, మీర్‌పేట్‌, కొంపల్లి, కాప్రా, నాచారం, అల్వాల్‌ కొత్త ఎక్సైజ్‌ పోలీస్‌ స్టేషన్లు.. ప్రస్తుతం ఉన్న ఎక్సైజ్‌ పోలీస్‌ స్టేషన్లలోని ప్రత్యేక గదుల్లో ఏర్పాటు కానున్నాయి.

Exit mobile version