NTV Telugu Site icon

Telangana : నిజమైన ప్రేమ అంటే ఇదే.. మొక్కకు పుట్టినరోజు వేడుక..

Vikarabad (3)

Vikarabad (3)

భర్త అంటే అమితమైన ప్రేమ ఉన్నవాళ్లు వాళ్లు భౌతికంగా దూరం అయిన తమతో ఉన్నారనే భావనలో ఉంటారు.. వికారాబాద్ తాండూరు మాజీ మున్సిపల్‌ చైర్‌పర్సన్‌ కోట్రిక విజయలక్ష్మి భర్త కోట్రిక వెంకటయ్య భౌతికంగా దూరమైనా ఆయనపై ఉన్న ప్రేమను మొక్క పై చూపిస్తుంది.. మొక్కలో తన భర్తను చూసుకుంది.. ఇంట్లో ఏ శుభకార్యం అయిన కూడా ఆ చెట్టును రెడీ చేసి అపూరూపంగా చూసుకుంటుంది.. తాజాగా తన భర్త పుట్టినరోజు సందర్బంగా చెట్టుకు వేడుక చేసింది. కుటుంబ సభ్యులతో కలిసి ఘనంగా పుట్టినరోజు వేడుకను చేసింది.. అందుకు సంబందించిన ఫోటోలు, వీడియో సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతున్నాయి..

2016 జూలై 29న వెంకటయ్య పుట్టిన రోజు సందర్భంగా ఆయనతో కలిసి తాండూరు పట్టణంలోని తాము నివసిస్తున్న ఇంటి ముందు ఆమె ఓ మొక్క నాటారు.. ఇక అతను అనారోగ్యం కారణంగా ఇదేళ్ల క్రితం చనిపోయారు..తన భర్త బర్త్‌డే సందర్భంగా నాటిన మొక్కకు ఏటా కుటుంబ సభ్యులతో కలిసి పుట్టిన రోజు వేడుక ఘనంగా నిర్వహిస్తున్నారు. ఆరు నెలల క్రితం రోడ్డు విస్తరణ పనుల్లో భాగంగా తప్పనిసరి పరిస్థితుల్లో చెట్టును జేసీబీ సహాయంతో వేర్ల నుంచి పెకిలింపజేశారు. దాన్ని తాండూరు వ్యవసాయ పరిశోధన కేంద్రంలో నాటారు. ఈసారి ఆ చెట్టుకే జన్మదిన వేడుకలు నిర్వహించి అన్నదానం చేశారు. విషయం తెలుసుకున్న గ్రీన్‌ ఇండియా ఛాలెంజ్‌ వ్యవస్థాపకుడు, రాజ్యసభ సభ్యుడు సంతోష్‌కుమార్‌ ఆమెతో మాట్లాడినట్లు కూడా తెలుస్తుంది..

జీవితం ఉన్నంత వరకూ ఇష్టపడ్డ వ్యక్తుల జ్ఞాపకాలు ఉంటాయని, వారు గుర్తొచ్చిన ప్రతిక్షణం ఆ జ్ఞాపకాలు మన హృదయాన్ని కదిలిస్తుంటాయని చెప్పారు. అయితే, జ్ఞాపకాలను ప్రకృతితో మమేకం చేయాలనే ఆలోచన అద్భుతమని పేర్కొన్నారు. భర్త జ్ఞాపకాలను ఒక గుర్తుగానే మిగిలిపోనీయకుండా సమాజం బాగు కోసం ఆలోచించడం అరుదైన విషయమని విజయలక్ష్మిని అభినందించారు. ‘పది మంది బాగు కోసం బాధను కూడా పండుగలా మార్చడం, మొకను నాటి పెద్ద చేయటం.. మీ మానవత్వం సమాజంలోని మరింత మందికి ఆదర్శం’ అని ప్రశంసించారు.. ఆమెకు తోడుగా ఉంటామని హామీ ఇచ్చారు.. ప్రస్తుతం ఆమె మొక్కకు జరిపిన వేడుక ఫోటోలు నెట్టింట వైరల్ అవుతున్నాయి..