Site icon NTV Telugu

Telangana Thalli Statue : తెలంగాణ తల్లి విగ్రహంలో చేసిన మార్పులు ఇవే..

Telangana Thalli

Telangana Thalli

Telangana Thalli Statue : డిసెంబర్ 9న తెలంగాణ సచివాలయం ఆవరణలో తెలంగాణ తల్లి విగ్రహ ఆవిష్కరణ ఘనంగా జరగనుంది. ఈ కార్యక్రమానికి సంబంధించిన అన్ని ఏర్పాట్లు ఇప్పటికే పూర్తి అయ్యాయని అధికారులు తెలిపారు. తెలంగాణ తల్లి విగ్రహాన్ని సోమవారం ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఆవిష్కరించనున్నారు. మొదట ఈ కార్యక్రమాన్ని కాంగ్రెస్ పార్టీ చీఫ్ సోనియా గాంధీ చేతుల మీదుగా నిర్వహించాలని భావించినప్పటికీ, ఆమె అనారోగ్య కారణంగా రాలేకపోతున్నారని సమాచారం. తెలంగాణ తల్లి విగ్రహాన్ని హైదరాబాద్ శివారులోని పెద్ద అంబర్‌పేట వద్ద ప్రత్యేకంగా రూపొందించారు. ఆకుపచ్చ చీరలో తెలంగాణ తల్లి విగ్రహాన్ని అద్భుతంగా తీర్చిదిద్దినట్లు అధికారులు వెల్లడించారు. విగ్రహ రూపులేఖల విషయంలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ప్రత్యేక శ్రద్ధ చూపినట్లు తెలిసింది. ఆయన సూచనల మేరకు విగ్రహ నమూనాను సిద్ధం చేసి, అందుకు అనుగుణంగా విగ్రహాన్ని తయారు చేశారు. ఈ కార్యక్రమానికి ప్రతిపక్ష పార్టీలను కూడా ఆహ్వానించాలని ప్రభుత్వం నిర్ణయించింది.

Lip Care Tips: చలికాలంలో పెదవులు పగులుతున్నాయా..? మృదువైన పెదాల కోసం ఇలా చేయండి

అయితే.. గత తెలంగాణ తల్లి విగ్రహం.. జరీ అంచు ఉన్న పట్టుచీర, మెడలో కంటె, బంగారు హారం ఎడమ చేతిలో బతుకమ్మ, కుడి చేతిలో మొక్కజొన్న చేతికి బంగారు గాజులు కాళ్లకు వెండి మెట్టెలు నడుముకు వడ్డాణం ఉండగా.. బంగారు అంచు ఉన్న ఆకుపచ్చ చీర మెడలో కంటె, బంగారు గొలుసు ఎడమ చేతిలో వరి, జొన్న, మొక్క జొన్న, సజ్జ అభయహస్తంగా కుడిచేయి చేతికి ఆకుపచ్చ గాజులు కాళ్లకు మెట్టెలు, పట్టీలు పీఠంలో పిడికిళ్లు పోరాట పటిమను ప్రతిబింబిస్తుంది. తెలంగాణ తల్లి విగ్రహం రూపంలో రాచరికానికి సంబంధించిన ఆనవాళ్లు లేకుండా ప్రత్యేక జాగ్రత్తలు తీసుకున్నట్లు తెలిసింది. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి, తెలంగాణ తల్లి ప్రతిమ రాష్ట్రం యొక్క సంప్రదాయాలు, సంస్కృతి ప్రతిబింబించేలా ఉండేందుకు ప్రత్యేక చొరవ తీసుకున్నారని అధికారులు తెలిపారు. ఈ కార్యక్రమంలో ప్రజలందరూ పాల్గొని విజయవంతం చేయాలని ప్రభుత్వం కోరింది.

Basil Joesph : డైరెక్షన్ వద్దు.. యాక్టింగే ముద్దు

Exit mobile version