NTV Telugu Site icon

Heat wave Warning: తెలంగాణకు హీట్‌వేవ్ వార్నింగ్.. 45 డిగ్రీలు నమోదయ్యే ఛాన్స్

Hear

Hear

తెలంగాణ రాష్ట్రంలో భారీగా ఉష్ణోగ్రతలు పెరుగుతాయని హైదరాబాద్ వాతావరణ శాఖ హెచ్చరించింది. ఇప్పటికే రాష్ట్ర వ్యాప్తంగా ఎండలు దంచికొడుతున్నాయి. బయటకు రావాలంటేనే హడలెత్తిపోతున్నారు. ఉదయం నుంచే సూర్యుడు భగభగమండిపోతున్నాడు. మరోవైపు ఉక్కపోతతో అల్లాడిపోతున్నారు. ఇప్పటికే ఇలాంటి పరిస్థితులతు ఉంటే.. తాజాగా వాతావరణ శాఖ మరో వార్నింగ్ ఇచ్చింది. రాబోయే నాలుగు రోజులు ఉష్ణోగ్రతలు పెరుగుతాయని తెలిపింది. 44 డిగ్రీల వరకు పెరగొచ్చని ఐఎండీ శాస్త్రవేత్త డాక్టర్‌ ఎ. శ్రావణి వెల్లడించారు.

ఇది కూడా చదవండి: SHR vs RR: ప్లేఆఫ్స్‌ రేసు రసవత్తరం.. సొంతగడ్డపై రాజస్థాన్‌ను సన్‌రైజర్స్‌ అడ్డుకునేనా?

తెలంగాణలో అక్కడక్కడ రాబోయే నాలుగు రోజుల్లో 45 డిగ్రీల వరకు ఉష్ణోగ్రతలు నమోదవుతాయని తెలిపారు. గురువారం ఆరెంజ్ అలెర్ట్ జారీ చేస్తామని ప్రకటించారు. ఇక ఉక్కపోత కూడా మరింత పెరగవచ్చని స్పష్టం చేశారు. ప్రజలు అప్రమత్తంగా ఉండాలని సూచించారు. అత్యవసర పరిస్థితులైతే తప్ప బయటకు రావొద్దని సూచించారు. అలాగే తగిన ఏర్పాట్లు చేసుకోవాలని చెప్పారు.

ఇది కూడా చదవండి: Faria Abdullah : బ్లాక్ డ్రెస్సులో స్టన్నింగ్ లుక్ లో మెరిసిన ఫరియా..

ఇదెలా ఉంటే గత కొద్ది రోజులుగా దేశ వ్యాప్తంగా ఎండలు దంచికొడుతున్నాయి. ఉదయం నుంచే సూర్యుడు సుర్రుమంటున్నాడు. విపరీతమైన వేడితో పిల్లలు, వృద్ధులు గజగజలాడుతున్నారు. తీవ్రమైన ఉక్కపోతతో అల్లాడిపోతున్నారు. చెమటలు కారణంగా అసౌకర్యానికి గురవుతున్నారు. ఇదెలా ఉంటే పిల్లలు, వృద్ధులు పట్ల జాగ్రత్తలు తీసుకోవాలని వైద్యులు సూచిస్తున్నారు. శరీరాన్ని చల్లబరిచే పదార్థాలు అందించాలని సూచిస్తున్నారు.