Studied Died: అమెరికాలోని అరిజోనా రాష్ట్రం ఫినిక్స్ ప్రాంతంలో హుజూరాబాద్‌కు చెందిన ముక్క నివేష్ (20) మృతి చెందాడు. మృతుడు ప్రముఖ వైద్యులు డాక్టర్ ముక్క కృష్ణ మూర్తి మనువడు. డాక్టర్ నవీన్, స్వాతిల కుమారుడు. ముక్క నివేశ్ గత సంవత్సరం జనవరిలో ఇంజనీరింగ్ కంప్యూటర్ సైన్స్ చేయడానికి అరిజోనా రాష్త్రంలోని ఆరిజోనా స్టేట్ యూనివర్సిటీలో జాయిన్ అయ్యాడు. ప్రస్తుతం నివేశ్ రెండో సంవత్సరం చేస్తున్నాడు. ఈరోజు కళాశాలకు వెళ్లి తిరిగి కారులో వస్తుండగా.. వెనుక నుంచి వచ్చిన కారు బలంగా ఢీ కొనడంతో నివేష్‌తో పాటుగా తన సహచర విద్యార్థి గౌతమ్ సైతం మృతి చెందినట్లు నివేష్ తల్లిదండ్రులు నవీన్, స్వాతిలు తెలిపారు. నివేశ్ మృతితో అతని కుటుంబాన్ని విషాద ఛాయలు అలుముకున్నాయి.
Read Also: Universal Studios : హాలీవుడ్ స్టూడియోలో ప్రమాదం.. 15మందికి గాయాలు