Site icon NTV Telugu

Jagadeesh Reddy: తెలంగాణ సంస్కృతితో సంబంధం లేకుండా కాంగ్రెస్ పార్టీ తెలంగాణ తల్లిని నిర్మించింది

Jagadeesh Reddy

Jagadeesh Reddy

Jagadeesh Reddy Comments on Telangana Talli: అంగరంగ వైభవంగా కాంగ్రెస్ నేతలు తెలంగాణ తల్లి విగ్రహ ఆవిష్కరణ చేసిన విషయం తెలిసిందే. అయితే ఈ విషయంపై తెలంగాణ రాష్ట్ర మాజీ మంత్రి జగదీష్ రెడ్డి స్పందించారు. ఇందులో భాగంగా ఆయన మాట్లాడుతూ.. తెలంగాణ సంస్కృతి, సంప్రదాయాలకు మరోసారి ప్రమాదం జరగబోతుందని, సినిమా పాటలతో ప్రజా విజయోత్సవ పాలన చేసుకున్నారని ఆయన అన్నారు. అయితే తాము సినిమా పాటలకు మేము వ్యతిరేకం కాదని, తెలంగాణ సంస్కృతి, సంప్రదాయాలు లేకుండా ప్రజా విజయోత్సవ పాలన చేసుకున్నారని ఆయన అన్నారు. ఆనాడు సినిమా పాటల మత్తులో పడి, తెలంగాణ రాష్ట్రాన్ని ఆంధ్రప్రదేశ్ లో కలిపారని.. సినిమా పాటల మోజులో తెలంగాణ సంస్కృతి సంప్రదాయాలను ఆనాడే తుంగలో తొక్కారని కీలక వ్యాఖ్యలు చేసాడు.

Also Read: KTR Exclusive Interview: కాంగ్రెస్‌ ఏడాది పాలనపై కేటీఆర్‌ ఎక్స్‌క్లూజివ్‌ ఇంటర్వ్యూ..

తెలంగాణ సంస్కృతితో సంబంధం లేకుండా కాంగ్రెస్ పార్టీ తల్లినీ నిర్మించారని, ప్రజా విజయోత్సవాల్లో ముఖ్యమంత్రి, మంత్రులు ఒక్కరు అంటే ఒక్కరు కూడా ‘జై తెలంగాణ’ అనలేదని ఆయన అన్నారు. తెలంగాణ మేధావుల్లారా.. తెలంగాణ ద్రోహుల పక్కన చేరకండి.. మా హయంలో కాళోజీ, బండి యాదగిరి, చాకలి అయిలమ్మ , కొమరంభిమ్ , బంధగి , జయశంకర్ ఒక్కొక్కరిని స్మరించుకున్నామని ఆయన గుర్తు చేసారు. కాంగ్రెస్ పార్టీ స్వరూపం తెలిసే విధంగా కాంగ్రెస్ పార్టీ తెలంగాణ తల్లినీ సచివాలయంలో పెట్టారని, జరుగుతున్న కుట్రలను తెలంగాణ వాదులు గమనించాలని ఆయన పేర్కొన్నారు. సమైక్య వాదుల తోత్తులు ఈ రాష్ట్రాన్ని నడిపిస్తున్నారని, అలంటి వారితో తస్మాత్ జాగ్రత్త అని ఆయన అన్నారు. దేవతులను స్మరించుకోవడం కోసం ప్రభుత్వ ఉత్తర్వులు అవసరం లేదని, మూర్ఖపు జివోలు తెచ్చి ప్రజలను బయపెట్టిస్తున్నారంటూ.. అన్ని వర్గాల నుంచి ఏడాదిలోనే వ్యతిరేకతను మూటగట్టుకున్న వ్యక్తి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఆయన అన్నారు.

Exit mobile version