NTV Telugu Site icon

TS SSC Results 2023: టెన్త్‌ ఫలితాల్లో సత్తా చాటిన బాలికలు.. నిర్మల్‌ ఫస్ట్‌.. వికారాబాద్‌ లాస్ట్‌..

Ssc

Ssc

TS SSC Results 2023: తెలంగాణలో పదవ తరగతి వార్షిక పరీక్షల ఫలితాలను విడుదలయ్యాయి.. ఈ ఫలితాలను విద్యాశాఖ మంత్రి సబితా ఇంద్రారెడ్డి విడుదల చేశారు.. ఏప్రిల్‌ 3వ తేదీ నుంచి 13వ తేదీ వరకు పదవ తరగతి పరీక్షలను నిర్వహించిన విషయం తెలిసిందే.. ఈ పరీక్షలకు 4,94,504 మంది దరఖాస్తు చేసుకోగా.. 4,91,862 మంది విద్యార్థులు హాజర్యారు.. వారిలో 4,84,370 మంది విద్యార్ధులు రెగ్యులర్ గా, 7,492 మంది విద్యార్థులు ప్రైవేటుగా హాజరయ్యారు.. రాష్ట్రంలో పదవ తరగతి రెగ్యులర్ విద్యార్థుల ఉత్తీర్ణత 86.60 శాతంగా ఉంది.. బాలురు సాధించిన ఉత్తీర్ణత 84.68 శాతంగా కాగా.. మరోసారి సత్తా చాటిన బాలికలు.. 88.53 శాతం ఉత్తీర్ణ సాధించారు.. బాలుర కంటే 3.85 శాతం అధికంగా ఉత్తీర్ణత సాధించారు బాలికలు..

ఇక, ప్రైవేట్ విద్యార్థుల విషయానికి వస్తే.. రాష్ట్రంలో పదవ తరగతి ప్రైవేటు విద్యార్థుల ఉత్తీర్ణత 44.51 శాతంగా ఉంది.. బాలురు సాధించిన ఉత్తీర్ణత 43.06 శాతం కాగా.. బాలికల ఉత్తీర్ణత 47.73 శాతంగా ఉంది.. అంటే బాలుర కంటే 4.67 శాతం అధికంగా ఉత్తీర్ణత సాధించారు బాలికలు.. మరోవైపు.. ఈ ఏడాది రాష్ట్రంలోని 2793 పాఠశాలల్లో 100 శాతం ఉత్తీర్ణత సాధించాయి.. ఇదే సమయంలో 25 పాఠశాలలు సున్నా శాతం ఫలితాలు పొందాయి. రాష్ట్రంలో నిర్మల్ జిల్లా 99 శాతం ఉత్తీర్ణత సాధించి ప్రథమ స్థానంలో నిలవగా.. రెండో స్థానంలో సిద్దిపేట్ 98 .65 శాతంజజ మూడో స్థానంలో సంగారెడ్డి 97.29 శాతం.. వికారాబాద్ జిల్లా అన్ని జిల్లాల కంటే అతి తక్కువ 59.46 శాతంతో చివరి స్థానంలో ఉంది.

మరోవైపు.. తెలంగాణ గురుకుల పాఠశాలలు 98.25 శాతం అత్యధిక ఉత్తీర్ణత సాధించాయి.. ప్రభుత్వ పాఠశాలలు 72.39 శాతంతో అత్యల్ప ఉత్తీర్ణత నమోదు చేశాయి.. T.S. Residential, Social Welfare Residential, BC Welfare Residential, Minority, Residential, Tribal Welfare Residential, Model Schools oo Private zeev రాష్ట్ర సరాసరి ఉత్తీర్ణత శాతం కంటే ఎక్కువ ఉత్తీర్ణత సాధించాయి.. KGBV, Aided, ZP, Ashram మరియు Government పాఠశాలలు రాష్ట్ర సరాసరి 86.60 శాతం కంటే తక్కువ ఉత్తీర్ణత సాధించాయి.

ఫలితాల కోసం.. కింది లింక్ ను క్లిక్ చేయండి..

Telangana 10th Class Result 2023