SSC Memos: మార్చి, జూన్ 2026 పరీక్షల్లో పాసైన ‘పది’ విద్యార్థులకు అలర్ట్.. రేపు సర్టిఫికేట్ల పంపిణీ..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
తెలంగాణలో పదో తరగతి చదువు పూర్తిచేసుకుని ఉత్తీర్ణులైన విద్యార్థులకు పాఠశాల విద్యాశాఖ, ప్రభుత్వ పరీక్షల విభాగం కీలక సమాచారాన్ని అందించాయి. 2026 మార్చి నెలలో జరిగిన ఎస్ఎస్సీ పబ్లిక్ పరీక్షలతో పాటు, జూన్ 2026లో నిర్వహించిన అడ్వాన్స్డ్ సప్లిమెంటరీ పరీక్షల్లో ఉత్తీర్ణత సాధించిన విద్యార్థుల ఒరిజినల్ పాస్ సర్టిఫికెట్లను ఆగస్టు 29, 2026న రాష్ట్రవ్యాప్తంగా ఉన్న అన్ని పాఠశాలలకు పంపిణీ చేయనున్నారు.
రాష్ట్రంలోని ప్రభుత్వ, జిల్లా పరిషత్, మోడల్ స్కూళ్లు, ఎయిడెడ్, ప్రైవేటు యాజమాన్యాల్లోని పాఠశాలలన్నింటికీ ఈ సర్టిఫికెట్లు ఒకేసారి అందుబాటులోకి రానున్నాయి. ఇప్పటివరకు ఆన్లైన్ ద్వారా డౌన్లోడ్ చేసుకున్న తాత్కాలిక షార్ట్ మేమోలను వినియోగించిన విద్యార్థులు, ఇకపై అధికారిక ఒరిజినల్ సర్టిఫికెట్లను నేరుగా తమ పాఠశాల ప్రధానోపాధ్యాయుల నుంచి ఉచితంగా స్వీకరించవచ్చు.
Also Read
- Hyderabad: రాజేంద్రనగర్ పరిధిలో భారీ పేలుడు శబ్దం.. ఇళ్లపైకి పరుగులు తీసిన ప్రజలు.. అసలు ఏం జరిగింది?
- AP Local Body Elections: నంద్యాలలో కలకలం.. సీపీఐ నేతల కిడ్నాప్‌కు టీడీపీ జెడ్పీటీసీ అభ్యర్థి యత్నం!
- OLED డిస్ప్లే, iPadOS 27 ఆపరేటింగ్ సిస్టమ్, A20 Pro చిప్సెట్తో Apple iPad mini (2026) విడుదల..!
- Supreme Court Recruitment 2026: సుప్రీంకోర్టులో ఉద్యోగాలు.. రూ.2 లక్షలకు పైగా జీతం.. పూర్తి వివరాలు ఇవే..

ఇంటర్మీడియట్, పాలిటెక్నిక్, ఐఐటీ లేదా ఇతర ఉన్నత విద్యా కోర్సుల ప్రవేశాల సమయంలో ఒరిజినల్ సర్టిఫికెట్లను సమర్పించాల్సి ఉన్నందున, విద్యార్థులు ఏమాత్రం ఆలస్యం చేయకుండా తమ పాఠశాలలను సందర్శించి సర్టిఫికెట్లు తీసుకోవాలని అధికారులు స్పష్టం చేశారు. సర్టిఫికెట్ అందుకున్న వెంటనే అందులో విద్యార్థి పేరు, తండ్రి పేరు, పుట్టిన తేదీ, సబ్జెక్టుల వారీగా వారికి వచ్చిన మార్కులు లేదా గ్రేడ్స్ సరిగ్గా ఉన్నాయో లేదో హెచ్ఎమ్ సమక్షంలోనే క్షుణ్ణంగా తనిఖీ చేసుకోవాలి. ఒకవేళ ఏవైనా తప్పులు ఉంటే వెంటనే ప్రధానోపాధ్యాయుడి దృష్టికి తీసుకెళ్లి విద్యాశాఖ ద్వారా సరిచేయించుకోవడానికి తగిన చర్యలు తీసుకోవాలని సూచించారు. సప్లిమెంటరీలో ఉత్తీర్ణులైన వారికి కూడా ఒరిజినల్ మేమోలను ఒకేసారి అందజేస్తుండటం గమనార్హం.
తాజావార్తలు
-
Hyderabad: రాజేంద్రనగర్ పరిధిలో భారీ పేలుడు శబ్దం.. ఇళ్లపైకి పరుగులు తీసిన ప్రజలు.. అసలు ఏం జరిగింది?
-
AP Local Body Elections: నంద్యాలలో కలకలం.. సీపీఐ నేతల కిడ్నాప్‌కు టీడీపీ జెడ్పీటీసీ అభ్యర్థి యత్నం!
-
OLED డిస్ప్లే, iPadOS 27 ఆపరేటింగ్ సిస్టమ్, A20 Pro చిప్సెట్తో Apple iPad mini (2026) విడుదల..!
-
Ahaan Panday: 10 కథలు రిజక్ట్ చేసిన యువ హీరో.. చివరకు ఆ డైరెక్టర్‌కు గ్రీన్ సిగ్నల్!
-
Supreme Court Recruitment 2026: సుప్రీంకోర్టులో ఉద్యోగాలు.. రూ.2 లక్షలకు పైగా జీతం.. పూర్తి వివరాలు ఇవే..
ట్రెండింగ్
-
11,000mAh భారీ బ్యాటరీ, IP66+IP68+IP69+IP69K రేటింగ్స్, 108MP కెమెరాతో HONOR X9e Pro విడుదల..!
-
Jio Platforms IPO: జియో ఐపీఓ అలాట్మెంట్ వచ్చేసింది.. షేర్లు అలాట్ అయ్యాయో.. లేదో.. చెక్ చేసుకోండి ఇలా..!
-
Sabarimala Virtual Queue Booking: అయ్యప్ప భక్తులకు గుడ్ న్యూస్.. అక్టోబర్ 29 నుంచే శబరిమల వర్చువల్ క్యూ బుకింగ్స్ షురూ..!
-
IND vs NZ: సిరీస్‌పై భారత్ కన్ను.. కివీస్‌కు డూ ఆర్ డై..! నేడే మూడో టీ20.. భారత్ ప్లేయింగ్ XI ఇలా..
-
Tilak Varma: ఎంఎస్ ధోనిని వెనక్కి నెట్టిన తిలక్ వర్మ.. విరాట్ కోహ్లీ తర్వాతి స్థానంలో స్టార్ బాయ్..!