Site icon NTV Telugu

ACB : తెలంగాణ గొర్రెల స్కాం కేసులో కీలక మలుపు.. ఏ1 నిందితుడు అరెస్ట్

Acb

Acb

ACB : తెలంగాణలో హల్చల్ రేపిన గొర్రెల పంపిణీ స్కామ్‌లో కీలక పరిణామం చోటుచేసుకుంది. ఈ కేసులో ప్రధాన నిందితుడిగా ఉన్న ఏ1 మొయినుద్దీన్‌ను శుక్రవారం ఉదయం శంషాబాద్ విమానాశ్రయంలో ఏసీబీ అధికారులు అరెస్ట్ చేశారు. గతంలోనే ఆయనపై లుక్‌ఔట్ నోటీస్ (LOC) జారీ చేయగా, హైదరాబాద్‌కు చేరుకున్న వెంటనే ఇమ్మిగ్రేషన్ అధికారుల సహాయంతో అదుపులోకి తీసుకున్నారు. కేసు నమోదు అయినప్పటి నుంచీ మొయినుద్దీన్, ఆయన కుమారుడు ఈక్రముద్దీన్ పరారీలోనే ఉన్నారు. ఇద్దరి పాస్‌పోర్టులను అధికారులు ఇప్పటికే ఇన్పౌండ్ చేశారు. వీరిద్దరూ ‘లోలోన ది లైవ్’ అనే సంస్థ పేరుతో దళారి వ్యవహారాన్ని నడుపుతూ ప్రభుత్వ పథకాన్ని దుర్వినియోగం చేసినట్లు ఆరోపణలు ఉన్నాయి.

Deputy CM Pawan Kalyan: డిప్యూటీ సీఎం పొగిడితే.. ఆ మంత్రులు సేఫ్ జోన్‌లో ఉన్నట్టేనా..?

తొలుత బీఆర్ఎస్ ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా ప్రారంభించిన గొర్రెల పంపిణీ పథకాన్ని పెద్ద ఎత్తున అక్రమాలకు వేదిక చేసినట్లు విచారణలో వెల్లడైంది. మొత్తం రూ.1200 కోట్ల మేర అవినీతికి ఈ స్కాం దారి తీసిందని అధికారులు అంచనా వేస్తున్నారు. ఇప్పటివరకు ఈ కేసులో మాజీ మంత్రి ఓఎస్డీ కళ్యాణ్, మాజీ ఎండీ రామచందర్ నాయక్, పలువురు వెటర్నరీ అధికారులు సహా 17 మందిని ఏసీబీ అరెస్ట్ చేసింది. తాజాగా అరెస్ట్ చేసిన మొయినుద్దీన్‌ను ఏసీబీ అధికారులు బంజారాహిల్స్‌లోని కార్యాలయానికి తరలించి విచారణ చేపట్టారు. ఈ కేసులో ఆయన కీలక పాత్ర పోషించినట్లు అధికారులు వెల్లడించారు.

Hit3 : 24 గంటల్లో బీభత్సం.. నాని కెరీర్ లోనే రికార్డ్ బ్రేకింగ్ ఓపెనింగ్

Exit mobile version