రైతు భరోసా నిధుల పంపిణీలో రికార్డు సృష్టించినట్లు రాష్ట్ర ప్రభుత్వం ప్రకటించింది. కేవలం 6 రోజుల్లో రూ. 7700 కోట్లు పంపిణీ చేసినట్లు వెల్లడించింది. ఏడేండ్లలో రైతులకు నిధుల పంపిణీలో ఇదే రికార్డు అని తెలిపింది. ఈ మేరకు రాష్ట్ర ప్రభుత్వం ఓ ప్రకటన విడుదల చేసింది. రాష్ట్ర ప్రభుత్వం ప్రకటన ప్రకారం.. రాష్ట్రంలోని రైతులకు వానాకాలం పంటల పెట్టుబడి సాయంగా అందించటంలో తెలంగాణ ప్రభుత్వం సరికొత్త రికార్డు నమోదు చేసింది. తొమ్మిది రోజుల్లో రూ. 9 వేల కోట్లు జమ చేస్తామని ప్రకటించిన ముఖ్యమంత్రి ఎ.రేవంత్ రెడ్డి ఆదేశాల మేరకు ప్రభుత్వం ఈసారి వేగంగా రైతుల ఖాతాల్లో నిధులను జమ చేసింది.
READ MORE: Snakebite: వర్షాకాలంలో పాముల సంచారం.. పాము కరిస్తే వెంటనే ఇలా చేయండి..
ఈసారి జూన్ 16వ తేదీన రైతు నేస్తం వేదికగా స్వయంగా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి రైతు భరోసా చెల్లింపులను ప్రారంభించారు. తొలి ఆరు రోజుల్లోనే 66.19 లక్షల మంది రైతులకు రూ. 7770.83 కోట్లు రాష్ట్ర ప్రభుత్వం రైతుల ఖాతాల్లో జమ చేసింది. శనివారం నాటికే రాష్ట్రంలో 9 ఎకరాల్లోపు భూములున్న రైతులందరి ఖాతాల్లో రైతు భరోసా నిధులు జమయ్యాయి. గడిచిన ఏడేండ్లలో ఇంత వేగంతో రైతుల ఖాతాల్లో నిధులు జమ చేయటం ఇదే మొదటిసారి.
READ MORE: IWMBuzz Digital Awards: ‘పర్సనాలిటీ ఆఫ్ ది ఇయర్’ అవార్డు అందుకున్న మాళవిక మోహనన్..!
వానాకాలం పంటలకు సంబంధించి గతంలో రైతులకు పంటలకు పెట్టుబడి సాయాన్ని ప్రభుత్వం గరిష్టంగా 169 రోజుల వరకు సాగదీసినట్లు పంపిణీ చేసింది. వ్యవసాయ శాఖ వద్ద అందుబాటులో ఉన్న రికార్డుల ప్రకారం 2021లో 11 రోజుల వ్యవధిలో రూ.7360 కోట్లు జమ చేయటం ఇప్పటి వరకు ఉన్న రికార్డు. ఇప్పుడు తెలంగాణ ప్రభుత్వం అంతకంటే వేగంగా 6 రోజుల్లోనే రూ.7770 కోట్లు పంపిణీ చేసింది. తొమ్మిది రోజుల్లో మొత్తం రూ. 9 వేల కోట్ల పంపిణీని విజయవంతంగా పూర్తి చేయాలని ఆర్థిక శాఖ, వ్యవసాయ శాఖ నిర్ణయించింది.