Site icon NTV Telugu

Congress: తెలంగాణ కాంగ్రెస్ అభ్యర్థుల జాబితా ఫిక్స్..!

Congress

Congress

దేశ రాజధాని ఢిల్లీలో నేడు ( శుక్రవారం ) జరిగిన తెలంగాణ కాంగ్రెస్ స్క్రీనింగ్ కమిటీ సమావేశం ముగిసింది. అభ్యర్ధుల ఎంపికపై నిన్న , ఇవాళ సుదీర్ఘంగా ఈ కమిటీ చర్చించింది. అభ్యర్ధుల జాబితాపై కసరత్తు పూర్తైనట్లు టాక్. అయితే టికెట్ కేటాయింపులపై వార్ రూంలో తెలంగాణ పీసీసీ అధ్యక్షుడు రేవంత్, నల్గొండ ఎంపీ ఉత్తమ్ కుమార్ రెడ్డి మధ్య వాడీవేడి చర్చ జరిగినట్ల తెలుస్తుంది. 60 శాతానికి పైగా ఏకాభిప్రాయంతో అభ్యర్ధులను స్క్రీనింగ్ కమిటీ ఖరారు చేసినట్లుగా తెలుస్తోంది. అవసరాన్ని బట్టి మరోసారి ఈ కమిటీ సమావేశం కానుంది. పూర్తి జాబితాను కాంగ్రెస్ పార్టీకి , కేంద్ర ఎన్నికల కమిటీకి స్క్రీనింగ్ కమిటీ సిఫారసు చేసినట్లు సమాచారం.

Read Also: Ram Pothineni: రామ్ న్యూ లుక్.. అదిరిపోయింది

నిన్న ( గురువారం ) సాయంత్రం మురళీధరన్ అధ్యక్షతన సమావేశమైన స్క్రీనింగ్ కమిటీ అర్ధరాత్రి వరకు చర్చించారు. సిట్టింగ్ ఎమ్మెల్యేలు, ఒక్కరు మాత్రమే దరఖాస్తు చేసుకున్న వివాదరహిత నేతల జాబితాను ఏఐసీసీ స్క్రీనింగ్ కమిటీకి పంపాలని తెలంగాణ కాంగ్రెస్ నేతలు నిర్ణయించారు. పోటీ తీవ్రంగా ఉన్న చోట్ల అసంతృప్తులు, రెబల్స్ తయారు కాకుండా కాంగ్రెస్ అధిష్టానం నజర్ పెట్టింది. వీలైనంత త్వరగా అభ్యర్ధుల జాబితాను విడుదల చేయాలని కాంగ్రెస్ పార్టీ స్పీ్డ్ గా అడుగులు వేస్తోంది. అయితే, వచ్చే వారం మరోసారి స్క్రీనింగ్ కమిటీ భేటీ అయ్యే అవకాశం కనిపిస్తుంది. తెలంగాణ రాష్ట్రంలోని 63 నియోజక వర్గాలపై కసరత్తు పూర్తి చేసినట్లు తెలుస్తుంది. ఈ మీటింగ్ ఐదు గంటల పాటు స్క్రీనింగ్ కమిటీ సమాలోచనలు చేశారు.

Read Also: USA: బార్‌లోకి అనుమతి నిరాకరణ.. ఐదుగురిని కాల్చి చంపిన మహిళ

Exit mobile version