తెలంగాణ ప్రభుత్వం వరుస గుడ్ న్యూస్ లను చెబుతుంది.. ఇప్పుడు మరో నోటిఫికేషన్ ను విడుదల చేసింది.. ఇప్పటికే టీఎస్పీఎస్సీ నుంచి పలు ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్లు విడుదల కాగా.. ఇతర నియామక సంస్థల ద్వారా కూడా ఉద్యోగ నోటిఫికేషన్లు విడుదలయ్యాయి.. ఇప్పుడు తాజాగా మరో నోటిఫికేషన్ ను విడుదల చేసింది సర్కార్.. ప్రభుత్వం కస్తూర్బాగాంధీ బాలికల విద్యాలయాలు, అర్బన్ రెసిడెన్షియల్ స్కూల్స్‌లలో ఖాళీ పోస్టుల ను భర్తీ చేయనున్నట్లు తెలంగాణ ప్రభుత్వం నిర్ణయించింది. కేజీబీవీ, యూఆర్‌ఎస్‌ల లో మొత్తం 1,241 ఉద్యోగాలు కాంట్రాక్టు పద్ధతి లో భర్తీ చేయనున్నారు. ఈ నోటిఫికేషన్ ద్వారా 854 పీజీసీఆర్టీ, సీఆర్‌టీ 273 పోస్టులు, పీఈటీ పోస్టులు 77, ఎస్ఓ పోస్టులు 12 ఖాళీలు ఉన్నాయి. పోస్టుల ను భర్తీ చెయ్యనున్నారని ప్రకటించారు..
ఈ ఉద్యోగాల పూర్తి వివరాలు..
రాత పరీక్ష ద్వారా ఎంపిక అయిన వారిని ఇంటర్వ్యూ చేస్తారు అనంతరం రెండు ఏళ్లు క్రాంటాక్ట్ ద్వారా ఉద్యోగాల ను భర్తీ చెయ్యనున్నారు..
స్పెషల్ ఆఫీసర్ – 38 పోస్టులు
పీజీసీఆర్టీ (ఇంగ్లీష్) – 110 పోస్టులు
పీజీసీఆర్టీ (మ్యాథ్స్) – 60
పీజీసీఆర్టీ (నర్సింగ్) – 160
పీజీసీఆర్టీ (తెలుగు) – 104
పీజీసీఆర్టీ (ఉర్దూ) – 02
పీజీసీఆర్టీ (బోటనీ) – 55
పీజీసీఆర్టీ (కెమిస్ట్రీ) – 69
పీజీసీఆర్టీ (సివిక్స్) – 55
పీజీసీఆర్టీ (కామర్స్) – 70
పీజీసీఆర్టీ (ఎకనామిక్స్) – 54
పీజీసీఆర్టీ (పిజిక్స్) – 56
పీజీసీఆర్టీ (జువాలజీ) – 54
సీఆర్టీ (బయో సైన్స్) – 25
సీఆర్టీ (ఇంగ్లీష్) – 52
సీఆర్టీ (హిందీ) – 37
సీఆర్టీ (మ్యాథమేటిక్స్) – 45
సీఆర్టీ (పిజికల్ సైన్స్) – 42
సీఆర్టీ (సోషల్ స్టడీస్) – 26
సీఆర్టీ (తెలుగు) – 27
పీఈటీ – 77
అర్హతలు :
ఈ ఉద్యోగాల కోసం బీఈడీ చదివి ఉండాలి.. పీజీలో 50 శాతం మార్కులు సాధించి ఉండాలి. పీఈటీ పోస్టుల కు ఇంటర్ పూర్తి చేసి.. పిజికల్ ఎడ్యూకేషన్ లో గ్రాడ్యుయేషన్ పూర్తి చేసి ఉండాలి.. ఇక అభ్యర్థుల తమ దరఖాస్తులను ఆన్ లైన్ ద్వారా పంపించాలి. వీటికి రూ.600 దరఖాస్తు ఫీజు చెల్లించాలి.. ఇక ఈ ఉద్యోగాల కు అప్లై చెయ్యాలని అనుకొనేవారు నోటిఫికేషన్ పూర్తిగా చదివి అప్లై చేసుకోవాలి.. మరిన్ని వివరాలకు అధికార వెబ్ సైట్ ను సందర్శించాలి..