Telangana Rising Global Summit 2025 LIVE Updates: తెలంగాణ రైజింగ్ గ్లోబల్ సమ్మిట్-2025 ప్రారంభమైంది.. ఫ్యూచర్ సిటీకి చేరుకున్న ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి..ముందుగా గ్లోబల్ సమ్మిట్ వేదిక వద్ద ఏర్పాటు చేసిన స్టాళ్లను పరిశీలించారు.. ఈ ప్రారంభోత్సవ సమావేశానికి రాష్ట్ర గవర్నర్ జిష్ణు దేవ్ వర్మ ముఖ్య అతిథిగా పాల్గొంటున్నారు.. ఈ వేడుకపై ముఖ్యమంత్రి ప్రసంగించనున్నారు.. ప్రజా ప్రభుత్వం రెండేళ్ల విజయోత్సవాలతో పాటు తెలంగాణ రాష్ట్ర ఉజ్జ్వల అభివృద్ధి లక్ష్యంగా ఆవిష్కరించే ప్రణాళికలను వివరిస్తారు. ప్రపంచవ్యాప్తంగా ప్రముఖ పారిశ్రామికవేత్తలు, వివిధ రంగాలకు చెందిన దిగ్గజాలు దాదాపు 3 వేల మంది ఇందులో పాల్గొంటున్నారు. ప్రారంభోత్సవ వేడుకల అనంతరం వివిధ రంగాలకు చెందిన ప్రతినిధుల బృందంతో విడివిడిగా సమావేశంకానున్నారు సీఎం రేవంత్ రెడ్డి.. దేశ విదేశాల నుంచి వచ్చిన వివిధ రంగాల ప్రతినిధులు, దిగ్గజ కంపెనీల ప్రతినిధులను ఈ సందర్భంగా సీఎం కలుసుకుంటారు. ప్రతి 15 నిమిషాలకో వన్ టు వన్ రౌండ్ టేబుల్ మీటింగ్ లో ముఖ్యమంత్రి పాల్గొంటారు.
మహాత్ముడు, అంబేద్కర్ ఆదర్శంగా మా అభివృద్ధి మార్గాన్ని రూపొందించుకుంటున్నాం. దేశంలో తెలంగాణ నూతన రాష్ట్రం. తెలంగాణలో ఎన్నో అవకాశాలు ఉన్నాయి. 2034 నాటికి ఒక ట్రిలియన్ డాలర్ ఎకనామీగా ఎదగాలనుకుంటున్నాం.. 2047 నాటికి మూడు ట్రిలియన్ డాలర్ల ఎకనామిగా ఎదగడమే లక్ష్యం. దేశ ఆర్థిక వృద్ధిలో 10% అందజేయాలన్న తెలంగాణ లక్ష్యం. చైనా, జపాన్, జర్మనీ, దక్షిణ కొరియా, సింగపూర్ స్పూర్తిగా తెలంగాణ ఎదుగుతోంది.: సీఎం రేవంత్ రెడ్డి
2014లో తెలంగాణ ఏర్పడినప్పుడే ప్రధానిగా మోడీ బాధ్యతలు చేపట్టారు. పదేళ్లలో తెలంగాణ ఎంతో అభివృద్ధి చెందింది. హైదరాబాద్ కేవలం రాష్ట్ర రాజధానే కాదు. దేశంలో కీలకమైన ఆర్థిక నగరం. ఫార్మా హబ్ గా, ఏరోస్పేస్ సెంటర్ గా అవతరించింది.: కిషన్ రెడ్డి
గ్లోబల్ సమ్మిట్ కు వచ్చిన ప్రపంచ అతిథులకు స్వాగతం. తెలంగాణ అభివృద్ధిలో మీ అందరికి స్వాగతం. క్యూర్, ప్యూర్, రేర్ మోడల్ తో తెలంగాణ ముందుకు పోతుంది. 2047 లక్ష్యంతో మా ప్రభుత్వం పనిచేస్తుంది. రాష్ట్రంలో మౌలిక వసతుల కల్పనకు పెద్దపీట వేస్తున్నాం: డిప్యూటీ సీఎం భట్టి
భారత్ ఫ్యూచర్ సిటీలో ఏఐ యూనివర్సిటీ ఏర్పాటుచేస్తున్నాం. భవిష్యత్తు నిర్మాణానికి తెలంగాణ ప్రభుత్వం ప్రయత్నిస్తోంది. తెలంగాణ ప్రభుత్వం రాజకీయ నిబద్ధతతో అభివృద్ధికి కృషి చేస్తోంది.: మంత్రి శ్రీధర్ బాబు
టెక్నాలజీకి పెద్దపీట వేస్తున్నాం. CM రేవంత్ రెడ్డి నాయకత్వంలో తెలంగాణ దూసుకుపోతుంది. ఉత్పత్తి, ఇంధన రంగాల్లో తెలంగాణ దూసుకుపోతుంది. కాంగ్రెస్ ప్రభుత్వం రెండేళ్ల ప్రజాపాలనను పూర్తి చేసుకుంది. ప్రపంచమంతా లాంచ్ ప్యాడ్ కోసం ఎదురుచూస్తోంది. తెలంగాణ అందుకు సిద్ధంగా ఉంది. : మంత్రి శ్రీధర్ బాబు
యువ ముఖ్యమంత్రి అద్భుతాలు చేశారు.. 20 లక్షల మంది రైతుల రుణాలు మాఫీ చేశారు.. మహిళలు, బాలికలకు ఉచిత ప్రయాణం కల్పించారు.. విద్యా ప్రమాణాలు పెంచేందుకు కృషి చేస్తున్నారు: నోబెల్ బహుమతి గ్రహీత కైలాష్ సత్యార్థి
గ్లోబల్ సమ్మిట్లో పాల్గొన్న సీఎం రేవంత్ రెడ్డి, డిప్యూటీ సీఎం భట్టి, మంత్రులు, కేంద్రమంత్రి కిషన్ రెడ్డి, దేశ, విదేశీ పారిశ్రామిక ప్రముఖులు.. పెట్టుబడులు, యువతకు ఉపాధి లక్ష్యంగా గ్లోబల్ సమ్మిట్.. గ్లోబల్ సమ్మిట్లో 27 అంశాలపై సెషన్లు..
తెలంగాణ రైజింగ్ గ్లోబల్ సమ్మిట్ ప్రారంభం.. గ్లోబల్ సమ్మిట్ను ప్రారంభించిన గవర్నర్ జిష్ణుదేవ్ వర్మ.. గ్లోబల్ సమ్మిట్ను ప్రారంభించడం సంతోషంగా ఉంది.. 2047కు తెలంగాణ త్రీ ట్రిలియన్ డాలర్ల ఎకనామీని చేరుకోవాలని ఆశిస్తున్నా.. రేవంత్ రెడ్డి నాయకత్వంలో తెలంగాణ అన్ని రంగాల్లో అభివృద్ధి చెందుతుంది: గవర్నర్ జిష్ణుదేవ్ వర్మ
తెలంగాణ రైజింగ్ గ్లోబల్ సమ్మిట్-2025 ప్రారంభం.. జాతీయ గీతం "జన గణ మన", తెలంగాణ రాష్ట్ర గీతం "జయ జయ హే తెలంగాణ" ఆలాపనతో కార్యక్రమం షురూ..
గ్లోబల్ సమ్మిట్ ప్రాంగణానికి చేరుకున్న కేంద్ర మంత్రి కిషన్‌రెడ్డి.. సమ్మిట్‌ని సమర్థించిన బీజేపీ.. సమ్మిట్‌కి పూర్తి మద్దతునిచ్చిన బీజేపీ..
గ్లోబల్ సమ్మిట్ ప్రాంగణానికి చేరుకున్న గవర్నర్ జిష్ణుదేవ్ వర్మకు ఘన స్వాగతం పలికిన ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి, మంత్రులు.. గ్లోబల్ సమ్మిట్ ప్రాంగణంలోని ఎల్సిడి టన్నెల్, భారీ ఎల్సీడీలను తిలకించిన గవర్నర్, ముఖ్యమంత్రి, మంత్రులు..
తెలంగాణ రైజింగ్ గ్లోబల్ సమ్మిట్‌కు ముఖ్య అతిథిగా గవర్నర్.. గ్లోబల్ సమ్మిట్‌కి హాజరైన గవర్నర్ జిష్ణు దేవ్ వర్మ..
గ్లోబల్ సమ్మిట్‌కి హాజరైన హీరో నాగార్జున.. సీఎంతో డిప్యూటీ సీఎంతో కలిసి స్టాల్స్‌ను పరిశీలించిన హీరో..
తెలంగాణ రైజింగ్ గ్లోబల్ సమ్మిట్-2025 ప్రారంభమైంది. ఈ సమ్మిట్‌కు సీఎం రేవంత్ హాజరయ్యారు. మంత్రులతో కలిసి ఉత్సాహంగా తిరుతున్నారు.. ఏర్పాట్లను సైతం పరిశీలించారు..
గ్లోబల్ సమ్మిట్‌లోని భారీ ఎల్సీడీ ముందు మంత్రులతో కలిసి ఫోటో దిగిన సీఎం రేవంత్‌రెడ్డి.. గ్లోబల్ సమ్మిట్ ప్రాంగణంలో మంత్రులతో కలిసి కలియదిరిగుతున్న సీఎం..