NTV Telugu Site icon

TS Raj Bhavan: బిల్లుల ఆమోదంపై క్లారిటీ ఇచ్చిన రాజ్ భవన్

Raj Bhavan

Raj Bhavan

తెలంగాణ ప్రభుత్వ బిజినెస్ రూల్స్- సెక్రటేరియట్ సూచనలకు అనుగుణంగా, తెలంగాణ స్టేట్ రోడ్ ట్రాన్స్‌పోర్ట్ కార్పొరేషన్ (ఉద్యోగులను ప్రభుత్వ సర్వీసులోకి స్వీకరించడం) బిల్లు-2023తో సహా రాష్ట్ర శాసనసభ కార్యదర్శి నుంచి అందిన అన్ని బిల్లులు చట్ట కార్యదర్శికి సిఫార్సు చేయబడ్డాయి. ఇది సంబంధిత నియమాలలో నిర్దేశించబడింది.

Read Also: Anil Sunkara: చిరంజీవితో వివాదం.. అదంతా చెత్త అన్న నిర్మాత

తెలంగాణ రాష్ట్ర రోడ్డు రవాణా సంస్థ (ఉద్యోగులను ప్రభుత్వ సర్వీసుల్లోకి చేర్చుకోవడం) బిల్లును ప్రవేశపెట్టేందుకు అనుమతిస్తూ, ఉద్యోగుల ప్రయోజనాలకు.. కార్పొరేషన్ శ్రేయస్సును దృష్టిలో ఉంచుకుని గవర్నర్ పది సిఫార్సులను సూచించారు. 2023 అసెంబ్లీలో అదేవిధంగా, నాలుగు ఇతర బిల్లులు గతంలో కొన్ని సిఫార్సులతో కూడిన సందేశాలతో శాసనసభ, శాసనమండలికి తిరిగి వచ్చాయి. ఇప్పుడు అందిన బిల్లుల్లో ఈ సిఫార్సులు సక్రమంగా నిర్వహించబడ్డాయా లేదా అన్నది గవర్నర్ నిర్ధారించాలన్నారు.

Read Also: Yami Gautam : అలాంటి వారు సినీ ఇండస్ట్రీ లో ఎక్కువ కాలం కొనసాగలేరు..

ఈ విషయంలో.. లా సెక్రటరీ సిఫార్సుల ఆధారంగా టీఎస్ఆర్టీసీ బిల్లుతో సహా అన్ని బిల్లులపై తదుపరి చర్యలు తీసుకుంటామని రాజ్ భవన్ స్పష్టం చేసింది. గవర్నర్ TSRTC బిల్లును నిలిపివేశారని, రాష్ట్రపతి ఆమోదం కోసం రిజర్వ్ చేయాలని నిర్ణయించుకున్నారని పేర్కొంటూ ప్రింట్- ఎలక్ట్రానిక్ మీడియాతో సహా కొన్ని వర్గాలలో చెలామణి అవుతున్న తప్పుడు సమాచారాన్ని అరికట్టడానికి ఈ ప్రెస్ కమ్యూనిక్ జారీ చేయబడింది. స్వార్థ ప్రయోజనాల కోసం ప్రచారం చేస్తున్న ఇలాంటి తప్పుడు వార్తలను ప్రచారం చేయొద్దని సూచించారు.