Heavy Rains: అల్లకల్లోలం సృష్టించిన వర్షం.. ఈ ఎనిమిది జిల్లాలకు రెడ్ అలర్ట్..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Heavy Rains: తెలంగాణాలో మళ్లీ వర్షం మొదలైంది. పలు జిల్లాల్లో దంచికొడుతోంది. తాజాగా సంగారెడ్డి, మెదక్ జిల్లాలో అల్లకల్లోలం సృష్టించింది వర్షం. దీంతో వాగులు పొంగిపొర్లుతున్నాయి. పలు చోట్ల చెరువులకు గండ్లు పడ్డాయి. సంగారెడ్డి జిల్లా పుల్కల్ లో 14.7 సెం. మీ, మెదక్ జిల్లా శివంపేటలో 12.8 సెం.మీ మేర వర్షపాతం నమోదయ్యాయి. సంగారెడ్డి జిల్లా మీన్ పూర్ లో కోమటి కుంటకు గండి పడటంతో పంటపొలాలు నీట మునిగాయి. మెదక్ జిల్లా నర్సాపూర్ మండలం కాజీపేట శివారు మోత్కుల కుంటకు గండి పడి నీరు వృథాగా పోతోంది. మెదక్ జిల్లా రెగోడ్లో వర్షానికి పెట్రోల్ బంక్ జలమయమయ్యింది. మెదక్ జిల్లా ధూప్ సింగ్ తండా, సంగారెడ్డి జిల్లా నాగల్ గిద్ద లోని మున్యాతండా, గైరాన్ తండాకు రాకపోకలు నిలిచిపోయాయి. మూడు రోజు మంజీరా నది ఉద్ధృతికి ఏడుపాయల ఆలయం మూతపడింది. అమ్మవారి ఆలయం ఎదుట మంజీరా నది ప్రమాదకర స్థాయిలో ప్రవహిస్తోంది. సింగూరు ప్రాజెక్టు 5 గేట్లు ఎత్తి నీటిని దిగువకు విడుదల చేస్తున్నారు అధికారులు.
READ MORE: Andhra pradesh : సత్యసాయి జిల్లా ధర్మవరంలో ఉగ్రవాదుల కదలికలు!
Also Read
- CM Revanth Reddy: పోలీస్ ఉద్యోగ పరీక్షలపై ప్రత్యేక నిఘా.. కోచింగ్ సెంటర్లపై కూడా ఫోకస్.. సీఎం రేవంత్ కీలక ఆదేశాలు
- Ajit Agarkar: టీమిండియాలో షమీ భవిష్యత్తుపై సందిగ్ధం.. సెలెక్టర్ల నిర్ణయం ఇదే
- Udhayanidhi Stalin: విజయ్ ప్రభుత్వం ఉగ్రవాదిలా చూసింది.. ఉదయనిధి కీలక వ్యాఖ్యలు
- India-Pakistan: చైనా హోవిట్జర్లను మోహరించిన పాకిస్థాన్.. ‘అవసరమైతే ఏదైనా చేస్తాం’ అన్న భారత్
కాగా.. రాష్ట్రంలో మరో మూడు రోజులపాటు భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ తెలిపింది. ఆగస్టు 18 వరకు ఈ వర్షాలు ఉంటాయని తెలిపింది. ఆగస్టు 16, 17న ఉత్తర, తూర్పు జిల్లాలో అతి భారీ నుంచి అత్యంత భారీ వర్షాలు కురిసే అవకాశం ఉంది. ఆగస్టు 16న ఏడు జిల్లాల్లో అత్యంత భారీ వర్షాలు కురిసే అవకాశం ఉండటంతో వాతావరణ శాఖ రెడ్ అలర్ట్ జారీ చేసింది. ఆదిలాబాద్, కొమరం భీమ్ ఆసిఫాబాద్, మంచిర్యాల, జయశకర్ భూపాలపల్లి, భద్రాద్రి కొత్తగూడెం, మహబూబాద్ , ములుగు జిల్లాలకు రెడీ అలెర్ట్ జారీ చేసింది. 8 జిల్లాలకు భారీ నుంచి అతి భారీ వర్షాలు కురిసే అవకాశంతో ఆరెంజ్ అలెర్ట్ జారీ చేసింది. నిర్మల్, జగిత్యాల, పెద్దపల్లి, కరీంనగర్, హనుమకొండ, వరంగల్, సూర్యాపేట, ఖమ్మం జిల్లాలకు ఆరెంజ్ అలెర్ట్ జారీ చేసింది.
READ MORE: Delhi gangster suicide: ఢిల్లీ జైలులో గ్యాంగ్స్టర్ సూసైడ్.. జైలు నంబర్ 15లో ఏం జరిగింది?
తాజావార్తలు
-
CM Revanth Reddy: పోలీస్ ఉద్యోగ పరీక్షలపై ప్రత్యేక నిఘా.. కోచింగ్ సెంటర్లపై కూడా ఫోకస్.. సీఎం రేవంత్ కీలక ఆదేశాలు
-
Ajit Agarkar: టీమిండియాలో షమీ భవిష్యత్తుపై సందిగ్ధం.. సెలెక్టర్ల నిర్ణయం ఇదే
-
Udhayanidhi Stalin: విజయ్ ప్రభుత్వం ఉగ్రవాదిలా చూసింది.. ఉదయనిధి కీలక వ్యాఖ్యలు
-
India-Pakistan: చైనా హోవిట్జర్లను మోహరించిన పాకిస్థాన్.. ‘అవసరమైతే ఏదైనా చేస్తాం’ అన్న భారత్
-
Karthi: నయనతార లేదా త్రిష.. కార్తీ కొత్త సినిమాలో హీరోయిన్ ఎవరు?
ట్రెండింగ్
-
Baba Vanga Prediction 2026: బాబా వంగా జోస్యం.. ఈ 5 రాశులకు కోటీశ్వర యోగం.!
-
Jowar Dry Fruits Laddu: ప్రోటీన్ రిచ్ ‘జొన్న డ్రై ఫ్రూప్ట్స్ లడ్డు’.. సులువుగా ఇంట్లోనే చేసేయండి ఇలా..!
-
Zodiac Predictions : ఆగస్టు 5న బుధ-గురు మహాయోగం.. ఈ 4 రాశులకు డబ్బే డబ్బు.!
-
Kitchen Hacks : అరటి తొక్కతో ఈ మ్యాజిక్ తెలుసా? బేకింగ్ సోడా కలిపితే సూపర్ రిజల్ట్.!
-
IndiGo Offer : ఇండిగో బంపర్ ఆఫర్.. 20 వేల ఉచిత టికెట్లు.!