PRASHAST : ప్రైవేట్ స్కూళ్లలో కొత్త స్క్రీనింగ్.. నిర్లక్ష్యం చేస్తే చర్యలు.!
- 3 నుంచి 18 ఏళ్ల పిల్లలకు స్క్రీనింగ్
- దివ్యాంగత్వం, అభ్యాసన లోపాల గుర్తింపు
- ప్రిన్సిపాళ్లు, సిబ్బందికి తప్పనిసరి శిక్షణ
- నిర్లక్ష్యం చేస్తే యాజమాన్యాలదే బాధ్యత
- Follow Us :
-
-
Add as a preferred
source on google
బడిలో చదువుతున్న ప్రతీ పిల్లాడూ ప్రత్యేకమే.. కానీ, కొందరు చిన్నారుల్లో ఉండే ప్రత్యేక అభ్యాసన లోపాలు లేదా దివ్యాంగత్వాన్ని సకాలంలో గుర్తించకపోతే వారి భవిష్యత్తు ప్రశ్నార్థకంగా మారే ప్రమాదం ఉంది. ఈ సమస్యకు చెక్ పెట్టేందుకు తెలంగాణ పాఠశాల విద్యాశాఖ ఒక కీలక నిర్ణయం తీసుకుంది. రాష్ట్రంలోని అన్ని ప్రైవేట్ పాఠశాలల్లో ‘ప్రశస్త్’ (PRASHAST) కార్యక్రమాన్ని అత్యంత కఠినంగా, ప్రాధాన్యతతో అమలు చేయాలని స్పష్టమైన ఆదేశాలు జారీ చేసింది. సుప్రీంకోర్టు ఉత్తర్వులకు అనుగుణంగా తీసుకువచ్చిన ఈ సరికొత్త స్క్రీనింగ్ విధానంపై ఇప్పుడు విద్యా వర్గాల్లో తీవ్ర చర్చ జరుగుతోంది.
అసలు ఏంటి ఈ ‘ప్రశస్త్’?
3 నుంచి 18 సంవత్సరాల వయస్సు గల పిల్లల్లో ఉండే వివిధ రకాల దివ్యాంగత్వాలను, శారీరక లేదా మానసిక అభ్యాసన లోపాలను ముందస్తుగానే పసిగట్టడానికి కేంద్ర ప్రభుత్వం ప్రత్యేకంగా ఈ ‘ప్రశస్త్’ (Pre-Assessment Holistic Screening Tool) స్క్రీనింగ్ విధానాన్ని రూపొందించింది. దీని ద్వారా చిన్నారుల సమస్యలను ప్రాథమిక దశలోనే గుర్తించి, వారికి తగిన విద్యా సహాయం , వైద్య సదుపాయాలు అందించడానికి వీలు కలుగుతుంది.
Also Read
- Siddipet Fake Death Certificate Scam: బతికున్నోళ్లను చంపేశారు.. 22 నకిలీ డెత్ సర్టిఫికెట్లతో స్కామ్
- Damodar Raja Narasimha : హైదరాబాద్కు వెళ్లాల్సిన పనిలేదు.. జిల్లాల్లోనే కార్పొరేట్ వైద్యం..
- Charminar Temple Rush: చార్మినార్లో పండుగ సందడి.. భాగ్యలక్ష్మి ఆలయానికి పోటెత్తిన భక్తులు.!
- Diwali Firecracker Accidents: హైదరాబాద్లో టపాసుల ప్రమాదాలు.. 60 మందికి కంటి గాయాలు.. 8 మందికి సర్జరీ.!
ప్రైవేట్ యాజమాన్యాలకు కఠిన మార్గదర్శకాలు
ఈ కార్యక్రమాన్ని సమర్థవంతంగా అమలు చేసేందుకు పాఠశాల విద్యాశాఖ డైరెక్టర్ పలు ఆదేశాలు జారీ చేశారు. యూడీఐఎస్ఈ+ (UDISE+) రికార్డుల ప్రకారం ప్రైవేట్ పాఠశాలల్లో పనిచేస్తున్న ప్రధానోపాధ్యాయులు, ప్రిన్సిపాళ్లు అందరూ తప్పనిసరిగా ‘ప్రశస్త్’ పోర్టల్లో నమోదు చేసుకోవాల్సి ఉంటుంది. వారితో పాటు పాఠశాలల్లోని ఉపాధ్యాయులు, ఇతర బోధనేతర సిబ్బంది కూడా ప్రిన్సిపాళ్ల లాగిన్ ద్వారా నిర్దేశించిన అవగాహన కార్యక్రమాన్ని పూర్తి చేయాలి. అనంతరం పాఠశాలలో చదువుతున్న అర్హులైన విద్యార్థులందరికీ నిర్ణీత సమయంలోగా స్క్రీనింగ్ ప్రక్రియను పూర్తి చేయాలని విద్యాశాఖ స్పష్టం చేసింది.
అలసత్వం వహిస్తే చర్యలు తప్పవు
ఈ మహత్తర కార్యక్రమం నిర్ణీత గడువులోగా పూర్తయ్యేందుకు ప్రైవేట్ పాఠశాలల యాజమాన్యాలు పూర్తిస్థాయిలో సహకరించాలని ప్రభుత్వం కోరింది. ఒకవేళ ఈ ఆదేశాలను నిర్లక్ష్యం చేసినా, స్క్రీనింగ్ ప్రక్రియను పూర్తి చేయడంలో విఫలమైనా సంబంధిత ప్రైవేట్ పాఠశాల యాజమాన్యాలే పూర్తి బాధ్యత వహించాల్సి ఉంటుందని స్పష్టమైన హెచ్చరికలు జారీ చేసింది. ప్రత్యేక అవసరాలు ఉన్న చిన్నారుల భవిష్యత్తు కోసం ప్రభుత్వం చేపట్టిన ఈ కార్యక్రమం అమలులో ఎలాంటి అలసత్వాన్ని సహించేది లేదని తేల్చిచెప్పింది.
తాజావార్తలు
-
PRASHAST : ప్రైవేట్ స్కూళ్లలో కొత్త స్క్రీనింగ్.. నిర్లక్ష్యం చేస్తే చర్యలు.!
-
Siddipet Fake Death Certificate Scam: బతికున్నోళ్లను చంపేశారు.. 22 నకిలీ డెత్ సర్టిఫికెట్లతో స్కామ్
-
Police Officer Death: షాకింగ్.. రోడ్డుపై టపాసులు కాల్చవద్దన్నందుకు పోలీసు అధికారి హత్య..
-
Scene : 3 రోజుల్లో 145 కోట్లు..సూర్య అరాచకం: ‘సీన్’ మూవీపై మహేష్ బాబు రివ్యూ!
-
Dheeraj Mogilineni : బుక్ మై షో ట్రెండింగ్ వెనుక పెద్ద స్కామ్?..’ఫేక్’ టికెట్ల బాగోతాన్ని బట్టబయలు చేసిన తెలుగు నిర్మాత
ట్రెండింగ్
-
7 అంగుళాల భారీ డిస్ప్లే, 10,000mAh కంటే ఎక్కువ బ్యాటరీతో రాబోతున్న iQOO Z12 సిరీస్..!
-
Varanasi Movie: ‘వారణాసి’లో టైమ్ ట్రావెల్ ట్విస్ట్.. కుంభకర్ణుడి పునర్జన్మగా ఆ పాత్ర?
-
Upcoming Smartphones: ఈ వారం లాంచ్ కానున్న కొత్త స్మార్ట్ఫోన్లు ఇవే.. 200MP కెమెరా, 8,000mAh బ్యాటరీతో Oppo Reno 17 సిరీస్..!
-
Airtel నుంచి ‘Buy 1 Get 1’ ఆఫర్.. ఆ ప్లాన్స్ తో ఒక్కసారి రీఛార్జ్ చేస్తే రెండుసార్లు ప్రయోజనం..!
-
Realme నుంచి పవర్ఫుల్ 5G ఫోన్లు.. 10,000mAh బ్యాటరీ, 200MP కెమెరాతో వచ్చేస్తున్న Realme 17 సిరీస్..!